Hi Nanna TRP: హాయ్ నాన్న మూవీ టీఆర్పీ రేటింగ్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

న్యాచురల్ స్టార్ నాని (Nani) సినీ కెరీర్ లో మాస్ సినిమాల కంటే క్లాస్ సినిమాలే ప్రేక్షకాదరణ ఎక్కువగా పొందాయి. హాయ్ నాన్న (Hi Nanna) సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని నాని కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమాకు భారీ షాక్ తగిలింది.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ లో కొన్ని రోజుల క్రితం ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 4.45 రేటింగ్ వచ్చింది. బేబీ కియారా (Kiara Khanna) ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో ఎంతగానో మెప్పించడం జరిగింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన హాయ్ నాన్నకు ఇంత తక్కువ రేటింగ్ రావడం ఏంటని నాని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఏదైనా కారణాల చేత ఇప్పుడు ఈ సినిమాకు మంచి రేటింగ్ రాకపోయినా భవిష్యత్తులో ఈ సినిమాకు మంచి రేటింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాని గత సినిమాలు బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి. న్యాచురల్ స్టార్ నానిని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. నాని రెమ్యునరేషన్, రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బలగం వేణు డైరెక్షన్ లో ఒక సినిమాలో వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. వరుస సినిమాలలో నటిస్తున్న నాని ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో కూడా నానికి మంచి గుర్తింపు ఉంది. భవిష్యత్తు సినిమాలతో నాని ఏ రేంజ్ లో సత్తా చాటుతారో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus