ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వరుసగా తమ పర్సనల్ ఫోటోలు, అలాగే తమ వ్యక్తిగత ఆశయాల గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడేవారి గురించి కోర్టుకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), జూనియర్ ఎన్టీఆర్(NTR), హీరోయిన్ శ్రీలీల, నివేదా థామస్, రష్మిక మందాన వంటి వారు కూడా తమ ఫోటోలను, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడుతూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది.
అయితే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కూడా ఇలాంటి వ్యవహారాలను ఖండిస్తూ కోర్టుకెక్కడం అనేది చర్చనీయాంశం అయ్యింది. సాధారణంగా వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి పట్టించుకోరు. కానీ వ్యక్తిగత జీవితం గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి తప్పుగా మాట్లాడటం, తప్పుడు పోస్టులు వేయడంపై వారు తట్టుకోలేకపోయారు అని అర్ధం చేసుకోవచ్చు.
వారి ఆవేదనని కూడా కోర్టు అర్ధం చేసుకుని సానుకూలంగా స్పందించినట్టు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో వారి ఫిర్యాదులను పరిశీలించి కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర, అవమానకర పోస్టులు, వాణిజ్య అవసరాలకు తమ ఫోటోలు వాడటంపై పవన్, ఎన్టీఆర్ వేసిన పిటిషన్‌లపై విచారణ జరిపింది ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలో కొన్ని లింకులు తొలగించినట్టు ప్రతివాదులు (Flipkart, Amazon, X, Google, Meta) వంటి వారు తెలిపారు.
ఆయా లింక్స్ అలాగే యూజర్ వాదనలు వినాలని కూడా కోర్టు వెల్లడించింది. ఫేక్ వార్తల పోస్టులపై స్పష్టతనివ్వాలని కూడా Insta వంటి సంస్థలకి సూచించింది. 3 వారాల్లో BSI, IP వివరాలు సేకరించాలని కూడా ఆదేశించి మే 12కి తదుపరి విచారణని వాయిదా వేసింది.