కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు మద్రాసు హైకోర్టు లక్ష రూపాయాల జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆ అమౌంట్ ను సి.ఎం.రిలీఫ్ ఫండ్ కు పంపాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.వివరాల్లోకి వెళ్తే…ఇటీవల విజయ్ ఓ లగ్జరీ కారుని దిగుమతి చేయించుకున్నాడు. దానికి పన్ను మినహాయింపు కోరుతూ…మద్రాసు హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేసాడు.ఈ పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ…దానిని తిరస్కరించింది. స్టార్ హీరోలు పన్ను కూడా చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చురకలు అంటించింది అంటించింది హైకోర్టు.విజయ్ కు కార్ల పై అమితమైన మోజు.
వింటేజ్ కార్లతో పాటు ..మార్కెట్లోకి వచ్చే కొత్తకార్లన్నిటిని వెంటనే కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తాడు.ఆల్రెడీ అతని దగ్గర బి.ఎం.డబ్ల్యూ మినీ కాపర్, టయోటా ఇన్నోవా, ఆడి ఎ8, రోల్స్ రాయిస్ ఘెస్ట్ వంటి కార్లు ఉన్నాయి. ఇటీవల ఇంగ్లండ్ నుంచి రోల్స్ రాయిస్‌ను దిగుమతి చేసుకున్నాడు. దీనికోసమే పన్ను మినహాయింపు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు విజయ్. కానీ అక్కడ ఇతనికి చేదు అనుభవమే ఎదురైందని చెప్పాలి.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ‘మాస్టర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఇప్పుడు ‘బీస్ట్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్