Bigg Boss 7 Telugu: రెచ్చిపోయిన శోభా – ప్రియాంక..! నామినేషన్స్ లో హై డ్రామా..!

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి సీజన్ ఎక్కువగా బూతులు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా డాక్టర్ బాబు గౌతమ్ బూతులు కంట్రోల్ చేసుకోలేక మాట్లాడేశేవాడు. అంతకుముందు మొదటి వారాల్లో అమర్ మాట్లాడాడు. అయితే, ఈసారి నామినేషన్స్ లో భోలే నోరుజారాడు. అసలు ఇంతకీ భోలే ఏమన్నాడంటే., శోభాశెట్టి భోలే ని నామినేట్ చేస్తూ రెచ్చిపోతోంది. బిగ్ బాస్ లో మోనిత లాగా అవ్వద్దని బోలే చెప్తుంటే ఇరిటేట్ అయిపోయింది. ఈ మోనితే నాకు తిండి పెట్టింది. ఇంతటి దాన్ని చేసింది. అందుకే నేను ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నానంటూ చెప్పింది.

దీనికి భోలే రెచ్చిపోయాడు. బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) మోనిత అని నేను నీకు ముద్ర వేస్తున్నానంటూ చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన శోభా యస్.. నేను మోనితనే అంటూ కుండని గట్టిగా కసితీరా కొట్టింది. ఇక్కడే నేను ఇలాగే ఉంటా.. బరాబర్ ఉంటా కరెక్టేనా ప్రశాంత్ అంటూ ప్రశాంత్ మాట్లాడినట్లుగా మాట్లాడింది. దీనికి భోలే అందుకే బరబార్ ఇచ్చాడు మీకు వాడు. బరాబర్ బహెం*** అంటూ నోరు జారాడు. దీంతో పక్కనే ఉన్న ప్రియాంక బాగా రియాక్ట్ అయ్యింది.

ఆడబిడ్డలు ఆడబిడ్డలు అంటూ అమ్మాయిల ముందు ఇలాగేనా మాట్లాడతారు. అంటూ ఫుల్ గా క్లాసి పీకింది. నువ్వు ఆగమ్మా, ఆగు అంటూ భోలే ప్రియాంక మాటలని ఇగ్నోర్ చేశాడు. అసలు నువ్వెంటీ మద్యలో అని, మద్యలోకి రావద్దని భోలే ప్రియాంకకి వార్నింగ్ ఇచ్చాడు. నీలాంటి వాళ్లని చాలామందిని చూశా.. ఆగు అనేసరికి ప్రియాంక ట్రిగ్గర్ అయ్యింది. భోలేని లెఫ్ట్ రైడ్ ఇచ్చేసింది. అలాగే శోభా కూడా ఫుల్ గా ఇచ్చిపారేసింది.

ఇక్కడే ప్రియాంక భోలే అన్నమాటలకి తూ.. అంటూ రెండుసార్లు ఉమ్ముకుంది. దీన్ని బోలే తప్పుబడ్డాడు. నువ్వు అన్నమాట కంటే ఇది చాలా తక్కువేలే అంటూ ప్రియాంక భోలేకి కౌంటర్ వేసింది. తిరిగి నేను కూడా తూ.. అన్నాను అనుకో నీ బ్రతుకులు ఏమి కావాలి అంటూ బోలే రెచ్చిపోయాడు. ఆ తర్వాత భోలే తిరిగి శోభాశెట్టిని నామినేట్ చేస్తుంటే చాలాసేపు భోలేని ఇరిటేట్ చేసింది శోభాశెట్టి. దీంతో బోలే నీకు గ్యారెంటీ ఎర్రగడ్డే అనేసరికి ఇంకా బిపి పెరిగిపోయింది.

నాకు పిచ్చి కాదు, నీకే మెంటల్ అంటూ బోలేని రెచ్చగొట్టింది. అంతేకాదు, నామినేషన్స్ ప్రోసెస్ జరగనివ్వకుండా కుండని తీస్కుంటూ చాలాసేపు ఆపింది. దీంతో భోలే బాగా ఇరిటేట్ అయిపోయాడు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత శోభా తెజతో ప్యాచ్ అప్ చేస్కుంటానికి వెళ్లింది. ఇదే సమయంలో భోలే కూడా శోభతో ఇంకా ప్రియాంకతో ప్యాచ్ అప్ చేస్కునే ప్రయత్నం చేశాడు. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus