ఒక్క పాటకు ఈ సింగర్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?

సినిమాల్లో పాటల ప్రాధాన్యత ఎప్పుడూ ప్రత్యేకమైనదే. కొన్ని సినిమాలు కేవలం హిట్ పాటల కారణంగా నిలబడతాయి. అయితే ఈమధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్లకే కాదు, సింగర్స్‌కి (Singers) కూడా భారీ పారితోషికం అందుతోంది. ఒకప్పుడు పాటలకు తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు కానీ, ఇప్పుడు కొందరు టాప్ సింగర్స్ సాలీడ్ గానే అందుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సింగర్ ఎవరు? అంటే, మొదటి స్థానంలో ఏఆర్ రెహమాన్‌ ఉంటారు. ఆయన సంగీత దర్శకుడు అయినా, తన పాటలకు కూడా ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

Singers

ఒక పాట పాడేందుకు ఆయన తీసుకునే ఫీజు కోటికి పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఛావా సినిమాతో హిట్ అందుకున్న రెహమాన్ (A.R.Rahman)  , రామ్ చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత రెండో స్థానంలో ఉండే శ్రేయ ఘోషాల్  (Shreya Ghoshal)  ఒక్క పాటకు రూ.25 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది. అన్ని భాషల్లోనూ హిట్ సాంగ్స్ పాడిన ఈ గాయని, అత్యధిక పారితోషికం అందుకుంటున్న లేడీ సింగర్ (Singers).

ఆమె తర్వాతి స్థానంలో సునిధి చౌహాన్, ఆర్జిత్ సింగ్, బాద్‌షా లాంటి స్టార్ సింగర్స్ ఉంటారు. వీరు ఒక్కో పాటకు రూ.18-20 లక్షల మధ్య తీసుకుంటారు. ప్రత్యేకంగా ర్యాపర్ బాద్‌షా పాటలు వందల మిలియన్ల వ్యూస్‌ను రాబట్టడం విశేషం. అలాగే బాలీవుడ్ లెజెండరీ సింగర్ సోనూ నిగమ్ ప్రస్తుతం ఒక్క పాటకు రూ.15-18 లక్షల వరకు తీసుకుంటున్నాడు. దిల్జీత్ దోసాంజే స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లకు రూ.50 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడని టాక్.

మరోవైపు, నేహా కక్కర్, మికా సింగ్, హనీ సింగ్ లాంటి పాప్ సింగర్స్ (Singers) ఒక్క పాటకు రూ.10 లక్షలు తీసుకుంటున్నారు. సౌత్ ఇండస్ట్రీలోనూ సింగర్స్‌కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, హిందీ ఇండస్ట్రీ స్థాయిలో రెమ్యునరేషన్ మాత్రం లేదు. బాలీవుడ్‌లో ఒక పాటకు 20 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటే, తెలుగులో మాత్రం టాప్ సింగర్స్ ఎక్కువలో ఎక్కువ రూ.5-7 లక్షల మధ్య మాత్రమే పొందుతున్నారు. ఏది ఏమైనా, ఇప్పుడు పాటలు కూడా సినిమాకు విజయాన్ని తీసుకొచ్చేంత స్థాయికి చేరుకున్నాయి. కాబట్టి టాప్ సింగర్స్ భారీగా డిమాండ్ చేసుకోవడం సహజమే!

యుగానికి ఒక్కడు.. ఎక్స్ ట్రా 30 నిమిషాల్లో ఏముంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus