Prabhas: సలార్ మూవీకి హైలెట్ సన్నివేశాలు ఇవేనా..?

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీస్తూ ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్ ఇస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మరో సినిమాకు ప్రశాంత్ నీల్ కమిటవుతున్నారు. ప్రస్తుతం సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అయితే సలార్ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాలు సినిమాలో ఎక్కువగా ఉంటాయని ప్రేక్షకులు అరుపులు పెట్టే విధంగా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించే సీన్లు సినిమాకు హైలెట్ అవుతాయని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారని ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చే విధంగా ప్రశాంత్ నీల్ ఈ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆర్మీ ఆఫీసర్ రోల్ లో ప్రభాస్ పాల్గొనే యుద్ధ సన్నివేశాలు సినిమాను మరో లెవెల్ కు తీసుకెళతాయని సమాచారం. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus