Vishal: విశాల్‌ ఎఫెక్ట్‌: ఇక ఆ సినిమాలకు కూడా చెన్నైలో సెన్సార్‌!

  • October 23, 2023 / 05:47 PM IST

సెన్సార్‌ బోర్డు మీద ప్రముఖ కథానాయకుడు విశాల్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో ఏకంగా పెద్ద ఎత్తున విచారణే జరుగుతోంది. అయితే ఈ క్రమంలో సెన్సార్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. హిందీలో ఓ తమిళ సినిమాను డబ్బింగ్‌ చేస్తే దాని సెన్సార్‌ కోసం ముంబయి వెళ్లాల్సిన అవసరం లేదంటూ సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. హిందీ వెర్షన్‌ సెన్సార్‌ను కూడా చెన్నైలోనే నిర్వహించవచ్చని స్పష్టం చేసింది.

ముంబయి సెన్సార్‌ బోర్డు సభ్యులపైనే విశాల్‌ ఈ ఆరోఫనలు చేశాడు. తన లేటెస్ట్‌ సినిమా ‘మార్క్ ఆంటోని’ హిందీ సెన్సార్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆధారాలతో సహా బయటపెట్టాడు విశాల్‌. ముంబయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)లోని కొంతమంది అధికారులకు ఎంత ముట్టజెప్పాల్సి వచ్చిందో కూడా ఆ వీడియోలో వెల్లడించాడు విశాల్‌. సెన్సార్ బోర్డు సభ్యులపై చర్చలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు విజ్ఞప్తి చేశాడు.

ఈ ఆరోపణల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారితో దర్యాప్తు జరిపించింది. లంచం తీసుకున్న అధికారులను ఉద్యోగం నుండి తీసేసింది. ఇంకా ఈ విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ప్రాంతీయ‌ చిత్రాల హిందీ డబ్బింగ్ సెన్సార్‌ సర్టిఫికేట్‌లను పొందే ప్రక్రియలో సెన్సార్‌ బోర్డు మార్పులు చేస్తోంది. తమిళ సినిమాల హిందీ సెన్సార్‌ ఇకపై చెన్నైలోనే చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే తెలుగు సినిమాల హిందీ వెర్షన్‌ సెన్సార్ సర్టిఫికేట్లను హైదరాబాద్ నుండే పొందొచ్చు.

విశాల్‌ (Vishal) పోరాటం ఫలితంగానే ఇది సాధ్యమైంది అంటూ సోషల్‌ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. విశాల్ ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచాడని మెచ్చుకుంటున్నారు. అయితే హిందీ సెన్సార్‌ సమస్య అంతకుముందు ఇంకెవరికీ ఎదురవ్వలేదా? లేకపోతే ఎదురైనా కామ్‌గా ఉన్నారా అనేది ఇక్కడ మరో ప్రశ్న. దీనికి పరిశ్రమ నుండి ఎవరైనా సమాధానం చెబుతారేమో చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus