Adipurush: హైకోర్టు పిటీషన్ వేసిన హిందూ సేన చీఫ్!

ఆదిపురుష్ సినిమాకు కష్టాల మీద కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాపై హిందూ సేన సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సినిమా విడుదలైన తొలిరోజే విమర్శలు వచ్చాయి. ఈ సినిమాపై చాలా నెగిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా కొన్ని పాజిటివ్ రివ్యూలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమాకు కష్టాల మీద కష్టాలు ఎదురవుతున్నాయి. సినిమాపై నేపాలీల ఆగ్రహంతో నేపాల్‌లో ఈ సినిమా షోలు రద్దయ్యాయి. ఇప్పుడు ఇండియాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై హిందూ సేన సంస్థ కోర్టును ఆశ్రయించింది.

దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు హిందూ సేన చీఫ్. ‘భారతీయులకు శ్రీరాముడు, సీతా మాత, హనుమంతుడి గురించి నిర్దిష్టమైన ఆలోచన ఉంది. ఆదిపురుష్ సినిమా ద్వారా ఆ ఆలోచనను మార్చే ప్రయత్నం జరుగుతోంది. సినిమాలో చూపించిన సన్నివేశాలు, చిత్రాలు హిందూ సంస్కృతిని అవమానించేలా, దేవుళ్లను తప్పుగా చూపించేలా ఉన్నాయి. ఇది హిందువుల హక్కులను ఉల్లంఘించడమే.’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

’పాత్రల దుస్తుల డిజైన్, హెయిర్ స్టైల్, పర్సనాలిటీ, బాడీ షేప్ గురించి స్పష్టమైన సూచన ఉంది. కానీ ఆదిపురుష్ లో ఇవి వక్రీకరించబడ్డాయి. ఈ వక్రీకరణ హిందూ స్ఫూర్తిని దెబ్బతీసింది. ఈ తప్పులను సరిదిద్దమని సినిమా నిర్మాత, దర్శకుడిని కోర్టు ఆదేశించాలి.’ అని హిందూ సేన చీఫ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలే సినిమాకి నార్త్ లో నెగిటివ్ రివ్యూలు రావడంతో ప్రేక్షకుల నుంచి కూడా ట్రోల్స్ వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో హిందుత్వ సంఘాలు తెరపైకి వచ్చి మరల (Adipurush) ఆదిపురుష్ చిత్రంపై వివాదం సృష్టించడం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. మరి చిత్రంపై ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా ముందుకి వెళ్తుందనేది చూడాలి.ఇక ప్రేక్షకులు కూడా చాలా మంది ఓం రౌత్ ని దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు మీమ్స్ క్రియేట్ చేస్తూ ఆదిపురుష్ చిత్రాన్ని ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్షం.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus