నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3′(HIT 3)(హిట్ : ది థర్డ్ కేస్) రూపొందింది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) ఈ సినిమాను నిర్మించారు. మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి 2 పార్టులు హిట్ అయ్యాయి కాబట్టి.. ఈ మూడో పార్ట్ పై కూడా అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకే దీనికి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 12.50 cr |
సీడెడ్ | 6.00 cr |
ఉత్తరాంధ్ర | 5.00 cr |
ఈస్ట్ | 2.20 cr |
వెస్ట్ | 1.80 cr |
గుంటూరు | 2.50 cr |
కృష్ణా | 2.00 cr |
నెల్లూరు | 1.00 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 33.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.50 cr |
ఓవర్సీస్ | 8.00 cr |
మిగిలిన భాషలు | 1.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 48.00 cr |
‘హిట్ 3’ సినిమాకు రూ.48 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నది కాదు. కానీ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే.. సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.