కోటి ఆశలతో.. కొత్త కోరికలతో 2023లోకి ఎంటర్ అయింది ఫిలిం ఇండస్ట్రీ.. పరిశ్రమకి పెద్ద సీజన్ సంక్రాంతి కాబట్టి ఈసారి ‘ఆదిపురుష్’ తో మొదలు పెట్టి.. దాదాపు అరడజను సినిమాలు పండక్కి షెడ్యూల్ చేసుకున్నాయి.. అయితే వివిధ కారణాలతో కొన్ని తప్పుకోగా.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ లాంటి బడా సీనియర్ హీరోల చిత్రాలతో పాటు.. ‘తెగింపు’, ‘వారసుడు’ వంటి డబ్బింగ్ బొమ్మలు విడుదలయ్యాయి.. చిరు, బాలయ్య బ్లాక్ బస్టర్ కొడితే.. తమిళ డబ్బింగ్ మూవీస్ యావరేజ్ టాక్‌తోనే మంచి వసూళ్లు రాబట్టాయి..
ఇక ఫిబ్రవరిలో చిన్న సినిమాలకు రూట్ క్లియర్ అయింది.. కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలీవుడ్ డెబ్యూ ‘సార్’ మినహాఇస్తే దాదాపుగా అన్నీ స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ మూవీసే సందడి చేశాయి.. కాకపోతే హిట్ పర్సంటేజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ.. ఈ ఫిబ్రవరిలో విడుదలైన ఫిలింస్.. వాటి రిజల్ట్ ఏంటనేది ఫిబ్రవరి మంత్ రివ్యూలో చూద్దాం..
రైటర్ పద్మభూషణ్ – హిట్..
సుహాస్, టినా శిల్ప రాజ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ మూవీకి షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. ఆషిశ్ విద్యార్థి, గౌరీ ప్రియ, రోహిణి కీలక పాత్రలు చేశారు.. పాజిటివ్ టాక్, మంచి వసూళ్లతో చూడదగ్గచిత్రంగా నిలిచింది..
సార్ – సూపర్ హిట్..
కోలీవుడ్ స్టార్, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘సార్’.. సంయుక్త మీనన్ హీరోయిన్.. వెంకీ అట్లూరి డైరెక్టర్.. తెలుగుతో పాటు తమిళంలోనూ (వాతి) పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. దర్శకుడు చక్కటి సందేశానికి కమర్షియల్ హంగులు జతచేసి చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది..
వినరో భాగ్యము విష్ణు కథ – హిట్..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీరా జంటగా.. కొత్త దర్శకుడు మురళీ కిిషోర్ రూపొందించిన లవ్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. కామెడీ, సెంటిమెంట్, థ్రిల్లింగ్ అంశాలతో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్‌ని అలరించింది..
నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ‘అమిగోస్’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కానీ.. ‘బింబిసార’ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయింది.. కనీసం సరైన వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది.. మిగతా చిన్న సినిమాల సంగతి సరేసరి.. ఎగ్జామ్స్ కారణంగా థియేటర్స్‌కి క్రౌడ్ రారు కాబట్టి టాక్ వస్తేనే టికెట్స్ తెగే పరిస్థితి లేదు.. మార్చి నెలలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటుంది..