Raghavendra Rao: భరణి-రాఘవేంద్రరావు సినిమా పరిస్థితి ఇదే!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కథానాయకుడుగా మారుతున్నారని చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి. శిష్యుడు జనార్దన మహర్షి ఇచ్చిన కథతో తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆ సినిమా ఉంటుందని కూడా చెప్పారు. ఈ వార్త బయటకు వచ్చి సుమారు ఏడాది అవుతుంది. అప్పటి నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో ఈ సినిమా ఉందా లేదా అనే ప్రశ్న మొదలైంది. తాజాగా రాఘవేంద్రరావు మాటలతో సినిమా పరిస్థితి తెలిసిపోయింది. ‘‘తనికెళ్ల భరణి శిష్యుడు జనార్ధన మహర్షి ఓ కథ చెప్పాడు. అందులో ప్రధాన పాత్రలో నటించమని నన్ను కోరాడు. కథ బాగుంది.

గాడ్‌ఫాదర్‌, మెంటార్‌ తరహా పాత్ర. సినిమా ఆలోచన బాగుంది. అయితే ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచాను’’ అని రాఘవేంద్రరావు ఇటీవల చెప్పారు. దీంతో ఈ సినిమా సంగతి ప్రస్తుతానికి ఆగినట్లే అని చెప్పొచ్చు. అయితే ఎందుకో హోల్డ్‌లో పెట్టారు అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు తన దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘పెళ్లి సందD’లో తొలిసారి కెమెరా ముందుకు వస్తున్నారు దర్శకేంద్రుడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇది కాకుండా మరో సినిమాలో రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో కనిపిస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. తొలి సినిమానే ఇంకా మొదలుపెట్టలేదు… రెండో సినిమా ఊసు ఎందుకు అంటారా… అయితే వాక్కే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus