Surya, Dulquer: హోంబలే మరో బంపర్‌ మూవీ చేయడానికి సిద్ధమట!

‘కేజీయఫ్‌’ కంటే ముందు నుండే ఉన్నప్పటికీ ఆ సినిమాతోనే ఫేమస్‌ అయింది హోంబలే ఫిల్మ్స్‌. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో వరుసగా సినిమాలు అనౌన్స్‌ చేస్తూ, పూర్తి చేస్తూ విడుదల చేయానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు తెలుగులో ‘సలార్‌’ చేస్తుండగా, మలయాళంలో ‘టైసన్‌’ చేస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల సుధా కొంగర ప్రసాద్ డైరక్షన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. భారీ చిత్రంగా ఉంటుంది అని చెప్పారు తప్ప.. కాస్టింగ్‌ చెప్పలేదు. దీనిపై కొత్తగా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. ఈ కాంబో మామూలుగా ఉండదు.

తెలుగులో ప్రభాస్‌తో ‘సలార్‌’ సినిమా చేస్తోంది హోంబల్‌ ఫిల్మ్స్‌. మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ హీరోగా ‘టైసన్‌’ అనే సినిమా చేస్తున్నారు. సుధా కొంగర ప్రసాద్‌ డైరక్షన్‌లో సినిమా అనేసరికి తమిళంలోనే అనేది అందరికీ అర్థమయ్యే విషయం. అయితే హీరో ఎవరు అని అనుకుంటుడగా.. హీరో కాదు, హీరోలు అనే సమాధానం వినిపిస్తోంది. అవును ఈ సినిమా మల్టీస్టారర్‌ అని చెబుతున్నాయి శాండిల్‌వుడ్‌ వర్గాలు. అంతేకాదు ఆ హీరోల పేర్లు కూడా చెబుతున్నారు.

సౌత్‌లో వరుస విజయాలతో స్టార్‌ హీరోగా దూసుకుపోతున్ సూర్య, దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా ఉంటుంది అనేది లేటెస్ట్‌ టాక్‌. ‘ఆకాశం నీ హద్దురా’లో సుధా కొంగర టేకింగ్‌కు ఫ్యాన్‌ అయిపోయిన సూర్య ఆవిడ అడగ్గానే కథ కూడా వినకుండా ఓకే చెప్పారని కోడంబాక్కం టాక్‌. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి చర్చలు సాగుతున్నాయని, త్వరలో పూర్తి క్లారిటీ ఇస్తారని అంటున్నారు. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్‌ చేస్తారట.

హోంబలే అంటే భారీ బడ్జెట్ సినిమాలు. ఈ సినిమా కూడా బడ్జెట్ విషయంలో ఆ కోవలోనే ఉంటుంది అని చెబుతున్నారు. సూర్య సినిమాకు తెలుగులోనూ క్రేజ్‌ ఉంది. ఇక దుల్కర్‌ సినిమాలకు సౌత్‌లో మొత్తం క్రేజ్‌ ఉంది. కాబట్టి ఈ సినిమా తెలుగులోనూ విడుదల చేస్తారని ఈజీగా చెప్పేయొచ్చు. ఈ మేరకు తెలుగు నటుల్ని కూడా ఈ సినిమాలో తీసుకుంటారని అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus