Adipurush Teaser: మరో వివాదంలో ఆది పురుష్ టీజర్.. దర్శకుడికి షాక్ ఇచ్చిన మంత్రి!

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆది పురుష్ . ఇప్పటికే సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ పలువురు ఈ టీజర్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ టీజర్ పై బిజెపి అధికార ప్రతినిధి మాళవిక అవినాశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు పై మండిపడ్డారు. ఇక ఈ టీజర్ పెద్ద ఎత్తున నేటిజన్ల విమర్శలకు కూడా గురైంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ టీజర్ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఈ టీజర్ పై మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ సరికొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే టీజర్ విషయంపై స్పందిస్తూ పలువురు రావణాసురుడి పాత్ర గురించి అభ్యంతరాలు వ్యక్తం చేయగా

ఈయన మాత్రం హనుమంతుడి పాత్ర గురించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడుతూ ఇదివరకే తాను ఆది పురుష్ సినిమా టీజర్ చూశానని, ఇందులో హనుమంతుడి పాత్ర పై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ ఈయన ఈ పాత్ర పై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ టీజర్ లో హనుమంతుడు ధరించిన అంగవస్త్రం తోలుతో తయారు చేసినట్టు చూపించారు. అది హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆయన ఆరోపణలు వ్యక్తం చేశారు.

 

హనుమాన్ చాలీసాలో హనుమంతుడు ఎలా ఉంటారనే విషయాన్ని స్పష్టంగా చూపించారు కానీ దర్శకుడు మాత్రం హనుమంతుడి పాత్రను సరిగా రూపొందించలేదని వెంటనే ఈ విషయంపై స్పందించి ఆ సన్నివేశాలను తొలగించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఈయన వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus