ఉపాసన తాతగారైన ఉమాపతి కామినేని అంత్యక్రియలలో అపశృతి చోటు చేసుకుంది. కామా రెడ్డి జిల్లాలో దోమకొండ గ్రామంలో ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబం హాజరు కాగా వారిపై తేనెటీగలు దాడి చేశాయి. రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు కామారెడ్డి జిల్లా దోమకొండ గడి కోటలో ఇవాళ జరుగుతున్నాయి. ఈ అంతక్రియల్లో చిరంజీవి, చరణ్ మరియు ఉపాసనతో కూడిన ఫ్యామిలీ పాల్గొంది. ఉమామహేశ్వర రావు పార్థివదేహాన్ని బయటకు తీసుకొస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి.
హఠాత్ పరిణామంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ కి గురయ్యారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసనతో పాటు బంధువులను సురక్షితంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఐతే ఈ ప్రమాదం నుండి చిరు కుటుంబంతో పాటు, ఉపాసన కుటుంబీకులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడినట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈనెల 27న ఉపాసన తాతగారు వయోభారంతో మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించడం జరిగింది.
ఐ ఏ ఎస్ అధికారిగా, టి టి డి మొదటి ఈ ఓ గా మరియు రచయితగా ఆయన అనేక బాధ్యతలు నెరవేర్చారు. దోమకొండ కోటలో పుట్టిన ఆ సంస్థానానికి చెందిన వారసుడే ఈ కామినేని ఉమాపతిరావు రావ్.
Most Recommended Video
రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!