కోలీవుడ్ లో అగ్ర తారగా కొనసాగుతుంది నాయన తార. అంతే సౌత్ హీరోయిన్లలో ఎక్కువ పారితోషికం తీసుకుంటూ యువ హీరోయిన్లను సైతం పక్కకు నెడుతుంది. అంతేకాదు తమిళ స్టార్ హీరోలతో సమానంగా నయన తార సినిమాలు భారీ వసూళ్ళను సాధిస్తుండడం విశేషం. ఆమె ఎంచుకుంటున్న కథలు, విభిన్నమైన పాత్రలు తనకు విజయాల్ని కట్టబెడుతున్నాయి. ఇక సినిమాల సక్సెస్ విషయంలోనే కాదు.. ప్రేమ వ్యవహారాలు కూడా కోలీవుడ్ వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి.
‘గ్యాంగ్’ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమాయణం గురించి అందరికి తెలిసిన సంగతే. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తూనే వుంది. రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే వున్నాయి. ఇప్పుడు మరో వార్త కోలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే అన్ని భాషల్లో కలుపుకుని 100 సినిమాలను పూర్తి చేశాకే పెళ్ళి చేసుకోవాలని నయనతార నిర్ణయించుకుందట. ఇప్పటి వరకూ 60 సినిమాల్లో నటించింది నయనతార. ఇప్పుడు మరో అరడజను చిత్రాలను లైన్లో పెట్టింది. ఈ క్రమంలో నయనతార అనుకున్న మార్క్ ను చేరుకోవాలంటే ఓ నాలుగైదేళ్ళయినా పడుతుందనడంలో సందేహం లేదు. ఆ రకంగా చూస్కుంటే 2022 వరకు నయన్ పెళ్ళి జరిగే అవకాశం లేదని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.