Housefull 5: ఇదేం విడ్డూరం సామీ.. ఒక్కో థియేటర్‌లో ఒక్కో క్లైమాక్సా? ఎందుకిలా చేశారో?

సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా చూసిన ఏ ఫ్రెండ్‌కో ఫోన్‌ చేసి ఆ సినిమా గురించి ముచ్చట్లు పెడుతుంటారు. ఆ సీన్‌ ఇలా ఉంది, ఈ సీన్‌ అలా ఉంది, క్లైమాక్స్‌ ఇలా ఉంది.. ఇంకో లా ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. మీరు కూడా ఇలానే చేస్తుంటారా? అయితే బాలీవుడ్‌ కొత్త చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’ (Housefull 5) చూశాక ఇలా మాట్లాడలేరు. ఒకవేళ మాట్లాడినా మీ ఫ్రెండ్‌కి విషయం అర్థం కాక, ‘ఏం చెబుతున్నావురా..’ అని అనే అవకాశం ఉంది.

Housefull 5

ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్ రెండు రకాలుగా ఉండబోతోంది. అవును, మీరు చదివింది నిజమే.. ‘హౌస్‌ఫుల్‌ 5’ (Housefull 5) సినిమా కోసం టీమ్‌ రెండు క్లైమాక్స్‌లు సిద్ధం చేసిందట. ఒక్కో థియేటర్‌లో ఒక్కో క్లైమాక్స్‌ వేస్తారట. అంటే ఒకే మల్టీప్లెక్స్‌లో రెండు స్క్రీన్లు ఉంటే ఒక్కో తెర మీద ఒక్కో క్లైమాక్స్ వస్తుందన్నమాట. సినిమా చూసేంతవరకు ఆ క్లైమాక్స్‌ ఏంటి అనేది ఎవరూ చెప్పలేరట. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే అదో స్పెషల్‌ అని కొందరు, ఇదో ప్రచార శైలి అని మరికొందరు చెబుతారు.

ఏదైతేనేముంది ఈ విడ్డూరమైన ప్రయత్నాన్ని ఇప్పడు చేస్తున్నారు. అలా అని ఇండియన్‌ సినిమాలో ఇదే తొలిసారి కాదు అని చెప్పాలి. ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే మలయాళ సినిమా పరిశ్రమలో చాలాఏళ్ల క్రితమే చేశారు. 1998లో మాలీవుడ్‌లో ‘హరికృష్ణన్స్’ అనే సినిమా వచ్చింది. మోహన్ లాల్ (Mohanlal) , మమ్ముట్టి(Mammootty), జూహీ చావ్లా (Juhi Chawla) ప్రధాన పాత్రధారులు. ఫాజిల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో జుహీ చావ్లాతో మోహన్ లాల్, మమ్ముట్టి ప్రేమలో పడతారు.

ఎవరిని పెళ్లి చేసుకోవాలనే సమస్యను పరిష్కరించడానికి హీరోయిన్‌ ఓ ఆకుతో టాస్ వేస్తుంది. ఆ తర్వాత జుహీ చావ్లా.. టాస్ ప్రకారం మోహన్ లాల్‌ని పెళ్లి చేసుకునేలా కొన్ని థియేటర్లలో చూపించగా.. మరికొన్నిచోట్ల మమ్ముట్టిని పెళ్లి చేసుకునేలా చూపించారు. ఇద్దరూ హీరోల అభిమానుల్ని సంతృప్తిపరచడానికి అలా చేశారని అంటారు.

విజయ్‌ దేవరకొండలా మారిపోయిన కల్యాణ్‌ రామ్‌.. ఏంటి సంగతి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus