ఇదివరకు ఏ భారతీయ చిత్రం రిలీజ్ కానీ రీతిలో బాహుబలి కంక్లూజన్ విడుదలై సంచలనం సృష్టించింది. మూడు వారాల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీపై బాలీవుడ్ ప్రముఖులు కొంతమంది అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఆ రికార్డ్ అన్నీ నిజాలు కావని కారుకూతలు కూస్తున్నారు. అందుకు సమాధానంగా ఈరోజు నిర్మాత శోభు యార్లగడ్డ ప్రత్యేక వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో బాహుబలి రిలీజ్ వెనుక దాగిన అసలు రహస్యాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 63 దేశాల్లో, 720 నగరాల్లో, 2073 థియేటర్లలో, 13,000 స్క్రీన్స్ లలో బాహుబలి విడుదలయినట్లు శోభు స్పష్టం చేశారు.
నాలుగు భాషల్లో, రెండు సౌండ్ ఫార్మెట్స్, 8 సబ్ టైటిల్స్ , 34 ఇంటర్నేషనల్ వెర్షన్స్ లలో సినిమాని అందించినట్లు తెలిపారు. 72 గంటల్లో 60 వేల కేడిఎమ్స్, రెండు వేల డీసీపీ డెలివెరీస్ ద్వారా సాధ్యమైందని శోభు చెప్పారు. ఈ కంటెంట్ సరఫరా మొత్తాన్ని క్యూబ్ వైర్ అనే సంస్థ సరిగ్గా నిర్వహించిందని, వారి సహకారంతోనే ఈ రికార్డ్స్ సాధ్యమయ్యాయని వెల్లడించారు. ఇప్పటికైనా బాహుబలి కంక్లూజన్ పై విమర్శలు తగ్గుతాయని ఆశిద్దాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.