ఒకవేళ మన పేరే.. ఓ ఫేమస్ సినిమా అయితే..?

ఇప్పటి వరకూ మనం అనేక సినిమా టైటిల్స్ చూసాం. కొన్ని చిన్న టైటిల్స్ ఉంటాయి.. కొన్ని పొడవాటి టైటిల్స్ ఉంటాయి. మరికొన్ని మనం రెగ్యులర్ లైఫ్ లో చూసే పేర్లే సినిమా పేర్లైనా లేదా పలానా హీరోకో.. విలన్ కో గనుక పెడితే.. ఆ పేర్లు మరింత పాపులర్ అయిపోతాయి అనడంలో సందేహం లేదు. ఉదాహరణకి ‘ఎనీ ప్లేస్.. ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్.. గణేష్. ఈ పేరు ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా..! ఇలా మన రెగ్యులర్ లైఫ్ లో ఉండే కొన్ని పేర్లు.. అలాగే ఆ పేరుతో ఉన్న సినిమా.. వాటి ప్రాముఖ్యత.. ఏంటో ఓ లుక్కేద్దాం రండి.

1) అంజలి : మణిరత్నం గారి బ్యూటిఫుల్ మూవీ.

2) చైతన్య : నాగార్జున మరియు ఇళయరాజా గారి మ్యూజికల్ హిట్.

3) చంటి : రెగ్యులర్ పేరు వెంకటేష్ గారి ఇండస్ట్రీ హిట్ సినిమా.. రవితేజ ఫ్లాప్ సినిమా కాదండోయ్

4) అన్నమయ్య : ఇప్పుడు లేరు.. ఈ పేరుతో అప్పట్లో ఉండేవారట.. ఇక సినిమా కూడా మరిచిపోలేని సినిమా

5) హిట్లర్ : మన దేశంలో లేరు.. కానీ చిరంజీవి గారు ఫేమస్ చేసారు ఈ పేరుని.. స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళందరికీ ఇదే పేరు

6) గణేష్ : డైలాగ్ రిపీట్ చేయనక్కర్లేదు గా.. వెరీ ఫేమస్ అండ్ మూవీ కూడా సూపర్ హిట్

7) కృష్ణ బాబు : పల్లెటూర్లలో ఈ పేరు చాలా ఫేమస్.. అండ్ మన బాలయ్య సినిమా పేరు కూడా..!

8) శీను : ఈ పేరు మనం రోజులోనో కుదిరితే వారం రోజుల్లో ఏదో ఒక రోజు వింటూనే ఉంటాం.. అండ్ చాలా బాధ పెట్టిన మూవీ

9) రాజా : చాలా రాయల్ గా ఉంటుంది… బట్ ‘ఆల్ టైం హిట్’ మూవీ.!

10) సమరసింహా రెడ్డి :రాయలసీమలో ఫేమస్ అనుకుంట… బ్లాక్ బస్టర్ మూవీ

11) సీతారామరాజు : రేర్ గా ఉంటుంది ఈ పేరు.. బట్ సూపర్ హిట్ మూవీ

12) సుల్తాన్ : సరదాగా పిలుచుకుంటాం.. కానీ బాగా ఫేమస్..! బాలయ్య నట విశ్వరూపం చూపించిన సినిమా

13) గణపతి : ఈ పేరు ఎక్కడైనా ఉంటుంది.. శ్రీహరి గారి ఎమోషనల్ మూవీ

14) బలరాం : మన స్కూల్ నుండీ కాలేజీ వరకూ వింటూనే వున్నాం.. అండ్ శ్రీహరి గారి యాక్షన్ మూవీ కూడా

15) యువరాజు : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

16) బద్రి : పవన్ కళ్యాణ్ గారి సూపర్ హిట్ మూవీ.. అండ్ రేణూ గారిని పవన్ గారిని కలిపింది కూడా ఇదే సినిమా…!

17) మాధురి : అబ్బాస్ రొమాంటిక్ ఫ్లిక్.. అండ్ చాలా మంది అమ్మాయిలకి ఉండే పేరే..!

18) శివాజీ : మన రెగ్యులర్ లైఫ్ లో వినే పేరే.. అండ్ రజినీకాంత్, శ్రీహరి ల సినిమాలు కూడా ఉన్నాయి

19) వైజయంతి : విజయశాంతి గారి యాక్షన్ సినిమా

20) భవాని : హీరో సురేష్ గారి క్లాసికల్ మూవీ..!

21) ఆజాద్ : ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన పేరు… అండ్ సినిమా కూడా సూపర్ హిట్

22) వంశీ : మహేష్ గారిని నమ్రత గారిని ఒకటి చేసిన సినిమా..!

23) బాచి : ఇప్పట్లో ఎవరికీ ఈ పేరు ఉండకపోవచ్చు.. కానీ అప్పట్లో ఉండేది. అలాగే మన పూరి జగన్నాథ్, జగపతి బాబు గారి సినిమా కూడా ఉంది

24) విజయరామరాజు : ఇది కూడా శ్రీహరి గారి సినిమానే..!

25) మురారి : మహేష్ కి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా అండ్ మూవీ కూడా సూపర్ హిట్

26) సుబ్బు : ఎన్టీఆర్ గారి మూవీ గుర్తుందిగా..! అలాగే మనం ఎక్కువ పలికే పేరే ఇది

27) రాఘవ : ఇది కూడా సురేష్ గారి మూవీ నే.. అండ్ ఎక్కువగా వింటున్న పేరే..!

28) రమణ : ఈ సినిమా హీరో పేరు పెద్దగా గుర్తుండకపోవచ్చు.. కానీ ఈ సినిమా ఉంది అండ్ పేరు కూడా పేరు కూడా మనం వినేదే..!

29) శేషు : ఇది రాజశేఖర్ గారు హీరోగా నటించిన సినిమా.. అండ్ మూవీ ఆడలేదు కానీ ఆయన నటన మాత్రం అద్బుతమనే చెప్పాలి. అలాగే ఈ పేరు కూడా మన రెగ్యులర్ లైఫ్ లో వింటున్నదే..!

30) ఆది : సినిమా వచ్చాక ఈ పేరు మరింత పాపులర్ అయ్యింది. ఎన్టీఆర్,వినాయక్ ల బ్లాక్ బస్టర్ మూవీ మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus