Jawan: ‘జవాన్‌’కు భారీ వసూళ్లు… కారణమేంటంటూ పోస్ట్‌ మార్టం!

ఓ సినిమా హిట్‌ అయితే చాలు… మొన్నీమధ్య వరకు బాలీవుడ్‌లో ఇదే పరిస్థితి. కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత వాళ్లు ఇలా మారిపోయారు అని చెప్పాలి. అప్పటివరకు సగటు సినిమాలు కూడా వందల కోట్లు వసూలు చేసేవి. మరోవైపు బాలీవుడ్ ఖాన్‌ త్రయం ఫామ్‌లో లేరు. దీంతో బాలీవుడ్‌ పరిస్థితి మరీ తీసికట్టుగా మారిపోయింది అనే కామెంట్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారుతోంది. అక్కడ కూడా భారీ వసూళ్ల సినిమాలు వస్తున్నాయి.

బాలీవుడ్‌లో ‘పఠాన్‌’ సినిమాతో భారీ విజయాల బోణీ కొట్టిన షారుఖ్‌ ఖాన్‌… రెండో భారీ విజయం కూడా ఆయనకే దక్కింది. ‘జవాన్‌’ సినిమాతో ఇప్పుడు బాక్సాఫీసు దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఏకంగా వీకెండ్‌లో రూ. 500 కోట్లకుపైగా వసూలు చేసి రూ. వెయ్యి కోట్లవైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. దీంతో ఓ చర్చ ఇప్పుడు మొదలైంది. అదే ఈ స్థాయి విజయానికి కారణమేంటి? ఇంతగా మార్పు రావడానికి కారణమేంటి అనేది చర్చ సారాంశం.

‘జవాన్‌’ (Jawan) సినిమా విజయం ముందే ఊహించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే అపజయం ఎరుగని అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి. అలా పాజిటివ్‌ ఇంటెంట్‌తో సినిమా విడుదలైంది. అందులో చూస్తే షారుఖ్‌ ఖాన్‌ నెవర్‌ బిఫోర్‌ అవతార్‌లో కనిపిస్తాడు అనే మాటలకు మించేలా లుక్‌, యాక్షన్‌ ఉండటంతో సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. తొలి రోజు వసూళ్లు చూసి వావ్‌ అనుకుంటే… ఇప్పుడు వీకెండ్‌లో రూ. 500 కోట్ల ప్లస్‌ వసూళ్లు సాధించింది.

దీనికి కారణమేంటా అని చూస్తే… సౌత్‌లో బాగా ఫేమస్‌ అయిన మాస్‌ హీరోయిజాన్ని, షారుఖ్‌ లాంటి స్టార్‌ హీరో హిందీలో చేయడమే అని చెప్పొచ్చు. సౌత్‌ సినిమాలు ఇప్పుడిప్పుడే నార్త్‌లో మంచి ఆదరణ పొందుతున్నాయి. దీనిని సరిగ్గా అర్థం చేసుకున్న షారుఖ్‌ ఖాన్‌ ఇక్కడి దర్శకుడిని తీసుకొని అక్కడ మాస్‌ మసాలా సినిమా తీసి విజయం సాధించాడు. ఇదన్నమాట లెక్క. రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ‘యానిమల్‌’తో అదే పని చేస్తున్నాడు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus