టాలీవుడ్ కు ఛార్మి మరో రోజా… అనే చెప్పాలి. తెలుగు సినిమాల ద్వారానే అరంగేట్రం చేసినప్పటికీ మొదట హిందీ, తమిళ, మలయాళ భాషల సినిమాల్లో నటించింది. ‘గౌరి’ ‘మాస్’ ‘అనుకోకుండా ఒక రోజు’ ‘లక్ష్మి’ ‘స్టైల్’ ‘మంత్ర’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఈమె బాగా టాలెంటెడ్.
అద్భుతంగా నటించగలదు, డాన్స్ చేయగలదు, యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి కూడా చేయగలదు. కానీ ఈమెకు హీరోయిన్ గా పెద్దగా కలిసి రాలేదు. అందుకే నిర్మాతగా మారి దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తుంది. దాదాపు 20 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఛార్మి ఎంత సంపాదించి ఉంటుంది అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. హైదరాబాద్లోని గచ్చిబౌలి లో ఉన్న ‘గోల్డ్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్’ లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది ఛార్మి.
అదేవిధంగా ఈమె ముంబైలో కూడా రెండు ప్లాట్లు కొనుగోలు చేసింది. అందుకే ఆమె సంపాదన ఎంత ఉంటుంది అనే డౌట్ అందరిలో రెట్టింపు అయ్యింది. ఛార్మి గ్యారేజ్లో కూడా వందల కోట్లు విలువ చేసే కార్లు కనిపిస్తాయి. ఛార్మి హీరోయిన్ గా రాణిస్తున్న టైంలో ఒక్కో సినిమాకు రూ.60 లక్షల నుండి రూ.1 కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకునేదట. పూరీ జగన్నాథ్ తో కలిసి ఛార్మి నిర్మించే సినిమాల విషయంలో..
ఆమెకు మినిమమ్ పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ‘మెహబూబా’ చిత్రానికి పూరి, ఛార్మీ లు ఇద్దరికీ నష్టాలు వచ్చాయి. ఆ ఒక్క సినిమాకి తప్ప వీరు నిర్మించే సినిమాలు దాదాపు లాభాలు తెచ్చిపెట్టినవే అని ఇన్సైడ్ టాక్.మొత్తంగా ఛార్మి ఈ 20 ఏళ్లలో రూ.100 కోట్ల పైనే సంపాదించినట్టు భోగట్టా. మరి ఇందులో నిజా నిజాలు ఎంత అనేది తెలియాల్సి ఉంది.