Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

డైరెక్టర్ కావాలనుకునే కుర్రాళ్లకి హీరోలు అవకాశాలు ఇవ్వాలంటే నెరేషన్ సరిగ్గా ఇవ్వడం రావాలి. ఇప్పుడు కొత్త కథలతో సినిమాలు ఏవీ రావడం లేదు. భవిష్యత్తులో కూడా ఎక్కువగా కొత్త కథలతో సినిమాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అయినా సరే ఓ హీరో,నిర్మాత కొత్త కుర్రాళ్ళతో సినిమాలు చేయడానికి ఎలా ఒప్పుకుంటారు? అంటే అది పూర్తిగా అతను కథ చెప్పే విధానం.. అంటే నెరేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. మెహర్ రమేష్ వంటి దర్శకుడికి స్టార్ హీరోలు, నిర్మాతలు అవకాశాలు ఇచ్చారు అంటే.. దానికి ముఖ్య కారణం ‘అతను కథ చెప్పే విధానం చాలా బాగుంటుంది’ అని చెప్పడంలో సందేహం లేదు.

Sujeeth

ఇది పూర్తిగా ఇండస్ట్రీ టాక్. ఎంత టాలెంట్ ఉన్నా నెరేషన్లో వీక్ అయితే హీరోలు, నిర్మాతలు అంత ఈజీగా ఛాన్సులు ఇవ్వరు. అయితే ఇప్పుడు నెరేషన్ ఎలా ఉన్నా.. కొంతమంది దర్శకులకు వెంటనే ఛాన్సులు వచ్చేస్తున్నాయి. అందులో టాప్ డైరెక్టర్లు అనుదీప్ కేవీ, సుజిత్ వంటి వారు ఉన్నారు. అనుదీప్ సరిగ్గా కథ చెప్పడు అని స్వయంగా హీరో తేజ సజ్జ ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. కానీ అతని మార్క్ కామెడీ సినిమాలో వర్కౌట్ అవుతుంది.

అసలు అనుదీప్ ని కొత్త వాళ్ళు బయట చూస్తే అతను దర్శకుడు అని నమ్మడానికి టైం పడుతుంది. ఎందుకంటే అతని వ్యవహార శైలి అలా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు సుజిత్ కూడా అంతే అని స్పష్టమవుతుంది. ‘ఓజి’ ప్రమోషన్స్ లో ‘సుజిత్ కథ చెప్పిన విధానం అస్సలు అర్థం కాలేదు.. కానీ అతని జెంజి కిడ్స్ డైరెక్టర్ అని భావించి ‘ఓజి’ చేయడానికి ఒప్పుకున్నాను’ అంటూ చెప్పాడు. పవన్ కళ్యాణ్ అలా చెప్పడం అందరికీ షాకిచ్చింది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓకె చేసిన దర్శకుడు కాబట్టి.. పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ ప్రాజెక్టు చేసేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు సుజిత్ నెక్స్ట్ సినిమా నానితో చేస్తున్నాడు.

కథల విషయంలో, నెరేషన్ విషయంలో నాని చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. అతను అంత ఈజీగా ఒక కథకి ఓకే చెప్పే రకం కాదు. మరి పవన్ కళ్యాణ్ వంటి హీరో సుజిత్ కి కథ చెప్పడం రాదు అని చెప్పినా.. నాని ఎలా ఓకే చేశాడు అనేది చాలా మందికి అర్థం కావడం లేదు. ఒక్కటైతే కన్ఫర్మ్ నానికి పాన్ ఇండియా ఇమేజ్ పై మోజు ఉంది. ‘దసరా’ నుండి అతను చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. సుజిత్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి.. ఆ రీజన్ తో నాని వెంటనే ఓకే చేసి ఉండొచ్చు.

నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus