OG: కేస్‌ స్టడీ: ‘ఓజీ’ సినిమా విషయంలో ప్రొడక్షన్‌ హౌస్‌ ఏం చేస్తోంది…!

సినిమా ఓకే చేయడం, స్టార్ట్‌ చేయడం, రిలీజ్‌ చేయడం మాత్రమే సినిమా టీమ్‌ చేతుల్లో ఉంది. మిగిలిన విషయాలన్నీ ఆటోమేటిగ్గా బయటకు వచ్చేస్తాయి. వాటినే ముద్దుగా లీక్స్‌ అని పిలుస్తుంటారు. పోస్టర్‌ ఎప్పుడు, సినిమా పేరేంటి, ఎవరు నటిస్తారు, ఎప్పుడు పాట, ఎప్పుడు టీజర్‌, ట్రైలర్‌ అంటూ లీక్‌ల రూపంలో చెప్పేస్తున్నారు కొంతమంది. అయితే ఇటీవల కాలంలో ఓ సినిమా టీమ్‌ నుండి అస్సలు లీక్‌లు బయటకు రావడం లేదు. దీంతో మిగిలిన సినిమాల టీమ్‌లు ఆ సినిమాను కేస్‌ స్టడీగా తీసుకోవచ్చు అంటున్నారు.

సినిమా గురించి, అందులోని విషయాల గురించి ముందుగా తెలిసిపోతే చాలా బాగుంటుంది. అయితే ఇది అభిమానులకు మాత్రమే. టీమ్‌కి మాత్రం చాలా బాధగా ఉంటుంది. సినిమా గురించి ఓ విషయాన్ని దాచి, దాచి బయటకు చెబితే వచ్చే ఆ రెస్పాన్స్‌ వాళ్లకు చాలా బూస్టింగ్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. అలా కాకుండా ఎప్పటకప్పుడు ఏదో రకంగా బయటకు వచ్చేస్తే కష్టమే. అయితే (OG) ‘ఓజీ’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు లీక్‌లు రాలేదు. వచ్చినా అవి నిజం కాలేదు.

సినిమా మొత్తం ఇండోర్‌ సెట్స్‌లో తీస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. మరి లీక్‌లు కాకుండా ఎలా ఆపుతున్నారు అనేది చూడాలి. పోనీ సినిమా అంతా ఒక్కరే పని చేస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. కానీ కాస్టింగ్‌ విషయంలో లీక్‌లు లేకుండా ఎలా ఆపుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీని తీసుకున్నారు. మామూలుగా అయితే ఇంత పెద్ద వార్త బయటకు రాకుండా ఆపడం కష్టమే. కానీ డీవీవీ టీమ్‌ చేసి చూపించింద.

బాలీవుడ్‌లో ముద్దుల హీరోగా పేరుపడ్డ ఇమ్రాన్ హష్మిని ఇప్పటివరకు తెలుగు సినిమాలల కోసం ఎవరూ సంప్రదించలేదు. అయితే హిందీలో అతను కొన్ని నెగెటివ్ రోల్స్ చేశాడు. వాటిని చూసి సుజీత్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారట. అయితే పవన్ ముందు అతను ఎంత బలంగా నిలబడతాడన్నది ఆసక్తికరం. ప్రియాంక మోహనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో శ్రియ రెడ్డి ఓ కీలక పాత్రధారి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus