Prabhas: ట్రోల్ చేస్తున్నారు సరే.. ఈ పాయింట్ పై క్లారిటీ ఎక్కడమ్మా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను గత రెండు, మూడు రోజులుగా తెగ ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ జనాలే కాదు.. ‘బాహుబలి’ తో ప్రభాస్ ను నెత్తిన పెట్టుకున్న నార్త్ జనాలు కూడా ట్రోల్ చేస్తుండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..’ఆదిపురుష్’ షూటింగ్ లో భాగంగా ముంబయిలో కార్లో వెళ్తున్న ప్రభాస్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో ప్రభాస్ లుక్ చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ప్రభాస్ వయసు 42 ఏళ్ళే..! కానీ ఆ ఫోటోల్లో 50ప్లస్ లా కనిపిస్తున్నాడు. మేకప్ కూడా లేదు.

అలాగే ప్రభాస్ మొహంలో మునుపటి కళ లోపించింది. అందుకే ప్రభాస్ లుక్ పై నార్త్ సోదరులు విమర్శలు గుప్పిస్తున్నారు. వాళ్ళతో తెలుగులో ఉన్న ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ కూడా చేతులు కలిపారు. ప్రభాస్ ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ మెయింటైన్ చేయడం లేదు. ‘మిర్చి’ వరకు అతను సినిమా.. సినిమాకి లుక్ తో పాటు బాడీ షేప్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించేవాడు. ‘బాహుబలి’ కోసం ఏ హీరో పడని కష్ఠాలు పడ్డాడు. అయితే ‘సాహో’ లో మాత్రం కొన్ని సన్నివేశాల్లో మేకప్ కూడా వేసుకోకుండా నటించాడు. ఆ మూవీ నుండీ ప్రభాస్ లుక్స్ అట్రాక్టివ్ గా ఉండడం లేదు అన్నది వాస్తవం. సరే..లుక్ బాలేదని ప్రభాస్ ను ట్రోల్ చేస్తున్నారు.. బానే ఉంది.

కానీ ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ శ్రీరాముని పాత్రని పోషిస్తున్నాడు.వాస్తవానికి ఆ పాత్రలో అయితే ప్రభాస్ కు మీసాలు ఉండకూడదు. కానీ అంత ఒత్తైన మీసాలు ఎందుకు ఉన్నట్టు అనే అనుమానం చాలా మందిలో ఉంది. ఈ లుక్ ‘ఆదిపురుష్’ కోసమేనా లేక.. ‘సలార్’ లో కూడా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అని చిత్ర బృందం చెబుతుంది. అందులో తండ్రి పాత్ర కూడా ఉందనేది వినికిడి. ఆ పాత్ర కోసం ప్రభాస్ ఇలా మారి ఉండొచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ వస్తేనే కానీ చెప్పలేం..!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus