ఈ రోజు సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు… ఎప్పటిలాగే రజనీకాంత్ గురించి ఇవి మీకు తెలుసా? రజనీ టాప్ రికార్డులు, రజనీకాంత్ బెస్ట్ పాత్రలు, రజనీ లైఫ్‌టైమ్ మెమొరీలు, రజనీ బెస్ట్ పిక్చర్స్ లాంటి వార్తలు కాకుండా… ఈరోజు ఓ ప్రశ్నతో ఈ స్టోరీ మొదలుపెడుతున్నాం. మాకు తెలిసి మీకు కూడా ఇలాంటి ప్రశ్న మనసులో మెదిలే ఉంటుంది. హెడ్డింగ్ చూశాక ఇంకో ప్రశ్న కూడా తప్పక వస్తుంది. 70 ఏళ్ల వయసులో రజనీకాంత్ ఎలా యూత్‌ని ఆకట్టుకుంటున్నాడు. హాలీవుడ్ స్టార్లు సిల్వర్‌స్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్‌కు సాధ్యం కానిది రజనీకి ఎలా వీలవుతోంది. పదండి చూద్దాం.
రజనీకాంత్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయనలోని కీ పాయింట్స్ స్టైల్, ఆయన మేనరిజమ్స్, స్క్రీన్ ప్రజెన్స్. 45 ఏళ్లుగా వాటితోనే ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడా అంటే అవుననే చెప్పాలి. కథలో సత్తా లేకపోయినా ఆయన స్టైల్, మేనరిజమ్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తోనే సినిమాలు హిట్ చేస్తున్నాడు. కొన్ని సినిమాలు మిస్ ఫైర్ అవ్వొచ్చు కానీ ఆయనలోని కీ పాయింట్స్ ఫ్లాప్ అవ్వలేదు. వాటిలో ఒకటి ఆయన చూపించే రెండు వేళ్లు గుర్తు. ‘బాబా’ సినిమాలో ఆయన ఆ గుర్తు చూపిస్తూ ఇచ్చే పోజు ఇప్పటికీ ఫేమస్. త్వరలో ఆయన స్థాపించబోతున్న రాజకీయ పార్టీ విషయంలోనూ ఆ గుర్తు కీలకం అవ్వబోతోంది.
ఇక ఆయన లాంగ్ జర్నీకి మరో కారణం… కొత్తదనం. ‘వయసు నెంబరు మాత్రమే’ అని సినిమా వాళ్లు అంటుంటారు. కానీ రజనీ దానిని చేసి చూపించాడు. ఆయన ఎంచుకునే కథల్లో కొత్తదనం ఎప్పుడూ కనిపిస్తుంది. దాని కోసం ఆయన తన ఎంపికలో చేసిన అతి పెద్ద మార్పు దర్శకులు. ఇటీవల కాలంలో యువ దర్శకులకే అవకాశం ఇస్తున్నాడు. అదే సమయంలో స్టార్ దర్శకులనూ వదలడం లేదు. రీసెంట్ మూవీస్ చేస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. పేట(కార్తిక్ సుబ్బరాజ్), కాలా, కబాలి (పా రంజిత్), అన్నాతె (శివ)… వీరందరూ కొత్తవాళ్లే. అదే సమయంలో రోబో, 2.0 (శంకర్), దర్బార్ (మురగదాస్) లాంటి సీనియర్ల సినిమాలు కూడా చేస్తున్నాడు. దీంతో రజనీ సినిమాల్లో కొత్తదనం కనిపిస్తుంటుంది. కథల విషయంలో ఎలాగూ మూసధోరణి ఫాలో అవ్వడు కాబట్టి… అది కూడా ప్లస్ పాయింట్.
వరుస సినిమాలు చేస్తున్నాడు అంటే.. అలా వచ్చి ఇలా వెళ్లేవి కూడా కావు. శివాజీ (2007) నుంచి పేట (2019) వరకు చూసుకుంటే ‘కోచ్చడయాన్’ మినహా మిగిలినవన్నీ బాగా ఆడినవే. వీటిలో ఎక్కువ శాతం ₹100 కోట్లు పైబడి గ్రాస్ వసూలు కూడా చేశాయి. మన దేశంతోపాటు విదేశాల్లో రజనీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. యూఎస్ టాప్ 10 గ్రాసర్స్‌లో ఆరు సినిమాలు రజనీకాంత్‌వి కావడమే దీనికి ఉదాహరణ. ఓవర్సీస్ ఆడియన్స్ అంత త్వరగా భారతీయ సినిమాలను ఇష్టపడరనే విషయం తెలిసిందేగా. అంటే వాళ్లనూ రజనీ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడు.
మరి ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ (72), సిల్వర్‌స్టర్ స్టాలోన్ (73) కంటే రజనీ ఎందుకు గొప్ప అనేగా ప్రశ్న. దానికీ సమాధానముంది. ఇటీవల ఆర్నాల్డ్ స్వ్కార్జ్‌నెగ్గర్ ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’, స్టాలోన్ ‘రాంబో: లాస్ట్ బ్లడ్’ విడుదలయ్యాయి. అయితే ఆ రెండూ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. అభిమానులు, ప్రేక్షకులు అంతగా సినిమాను ఆదరించలేదు. వారి వయసుకు దగ్గరగా ఉన్న రజనీ ఇంకా అభిమానులను అలరిస్తున్నాడు. మరి ఈ లెక్కన వారికంటే రజనీ బెటరే కదా. రజనీ జోరు చూస్తుంటే రాజకీయాల్లోకి వెళ్లాక కూడా సినిమాల్లో చేసేలానే ఉన్నాడు. అంటే ఈ జోరు ఇంకా కొనసాగేలా ఉంది. ఇంత చెప్పుకున్నాక ఆఖరున తలైవాకి పిరందనాళ్ వాళ్తుక్కల్’ చెప్పేయండి. అదేనండి ‘జన్మదిన శుభాకాంక్షలు’.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!