వెంకట ప్రభు ప్రసాద్‌.. సప్తగిరి ఎలా అయ్యాడు?

ప్రేమ కథ చిత్రమ్ లో నెల్లూరు యాసలో తెగ నవ్వించిన నటుడు సప్తగిరి. దర్శకుడు అవ్వాలని సినీ ఫీల్డ్ కి వచ్చిన సప్తగిరి.. నటుడిగా.. హాస్యనటుడిగా.. హీరోగా విజయాలను అందుకుంటున్నారు. అయితే అతని అసలు పేరు అది కాదు. వెంకట ప్రభు ప్రసాద్‌. మరి సప్తగిరి అని ఎందుకు పెట్టుకున్నారు.. ఈ ప్రశ్న వెనుక పెద్ద స్టోరీ ఉంది. అది అతని మాటల్లోనే.. ” సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన ఉన్న రోజుల్లో ఒక రోజు తిరుమలకు దర్శనానికి వెళ్లా. స్వామివారిని చక్కగా దర్శించుకున్నాక కూడా సానుకూల ఆలోచనలు లేవు. అలా తిరుమల మాడ వీధుల్లో తిరుగుతున్నా. ఆలయాన్ని చూస్తూ ఒకచోట అలా నిలబడి ఉన్నా. సడెన్‌గా ఓ వ్యక్తి నా వెనుక నుంచి వచ్చి ‘నాన్నా సప్తగిరీ.. పక్కకు జరుగు’ అన్నాడు. సాధారణంగా తిరుమలలో ఏ వ్యక్తి పేరైనా తెలియకపోతే వారిని గోవిందు.. నారాయణ.. ఇలా స్వామివారి పేర్లతో పిలుస్తారు. కానీ నన్ను ఎవరబ్బా సప్తగిరి అని పిలిచారని వెనక్కి తిరిగి చూశా.

ఆయన్ని చూడగానే ఒకరకమైన వైబ్రేషన్‌ వచ్చింది. కాషాయ వస్త్రధారణలో చినజీయర్‌ స్వామి వారిలా ఉన్నారు. పక్కకు జరిగి పూర్తిగా వెనక్కి తిరిగి చూడగా, అలాంటి వేషధారణలోనే ఓ 40మంది సాధువులు కనిపించారు. ఆ సన్నివేశం నాలో పాజిటివ్‌ వైబ్రేషన్‌ కలిగించింది. వాళ్లందరూ నన్ను దాటుకుంటూ వెళ్లారు. చాలా మంది నన్ను చూసి చిరునవ్వు చిందిస్తూ వెళ్లారు. ఆ రోజుతో నా పేరు సప్తగిరి అని పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత ఓ పది.. పదిహేను రోజుల్లో హైదరాబాద్‌ వచ్చేశా.” అంటూ ఆనతి సంగతిని గుర్తుచేసుకున్నారు. వెంకట ప్రభు ప్రసాద్‌ పేరు తనకి అపజయాన్ని అందిస్తే.. సప్తగిరి అనే పేరు విజయాన్ని అందించిందని వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus