విజయ్ దేవరకొండ లుక్ ను పూరి అలా మార్చబోతున్నాడట..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈమధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సుమారు 4 ఏళ్ళ నుండీ హిట్టు కోసం ఎదురుచూస్తున్న పూరీకి ఏకంగా బ్లాక్ బస్టర్ దక్కింది. ఈ నాలుగేళ్ళలో పూరి ప్లాపుల్లో ఉండడంతో… ఏ హీరో కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ కు ముందు విజయ్ దేవరకొండ కు ఓ కథ చెప్తే… ఆ కథను హోల్డ్ లో పెట్టాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టయ్యాక విజయ్ దేవరకొండ పూరికి ఒకే చెప్పాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి ‘ఫైటర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేసారని సమాచారం.

ఇక ఈ ప్రాజెక్ట్ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రాన్ని ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ పై ఛార్మి, పూరి కలిసి నిర్మించబోతున్నారు.ఇక ఈ చిత్రంలో విజయ్ ‘మార్షల్’ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపించబోతున్నాడు. తన సినిమాలో ప్రతీ హీరోకి కొత్త ఆటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ తో ప్రెజెంట్ చేస్తుంటాడు పూరి. మరి ఈ రౌడీ హీరోని ఎలా చూపించనున్నాడా అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఈ ‘ఫైటర్’ కోసం విజయ్ తో సిక్స్ ప్యాక్ చేయించబోతున్నాడని తెలుస్తుంది. ఈ లుక్ లో విజయ్ ఎలా కనిపిస్తాడా అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus