సినిమాల వసూళ్ల విషయంలో చాలా ఏళ్లుగా సగటు ప్రేక్షకుడికి డౌట్స్ ఉన్నాయి. సినిమాకు వస్తున్న టాక్, సినిమా చూపిస్తున్న ఇంపాక్ట్‌కు.. సినిమా వసూళ్లకు సంబంధం ఉండటం లేదు. ఇంతేసి ఎలా వస్తున్నాయి అనే ప్రశ్నలు చాలా రోజుల నుండి ఉన్నాయి. ఫలితం విషయంలో ఒకేలా కనిపించిన రెండు సినిమాల వసూళ్ల విషయంలో వందల కోట్లు తేడా ఎందుకు కనిపిస్తోంది అనే చర్చ మొదలైంది. సరిగ్గా ఈ సమయంలో కలెక్షన్ల పోస్టర్లు ఫ్యాన్స్ కోసమే అంటూ నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు మొత్తం పరిస్థితిని మార్చేశాయి.
అంటే సినిమాకు వస్తున్న వసూళ్లు చెబుతున్నంత లేవు అని చెప్పకనే చెప్పారు. దీంతో సినిమాల వసూళ్ల విషయంలో వచ్చే పోస్టర్లు, సమాచారాన్ని ఇక నమ్మలేం అని సినిమా అభిమానులు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా ‘దేవర’ సినిమా వసూళ్ల గురించి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో మా ఆనందం కోసం లెక్కలు చెబుతున్నారా? అని గుర్రుగా ఉన్నారు అని ఓ టాక్. ఈ క్రమంలో ‘దేవర’ (Devara) సినిమా వసూళ్లు అంటూ దసరా సందర్భంగా చిత్రబృందం రూ.500 కోట్ల పోస్టర్‌ను వదిలింది.
దీంతో మరోసారి మా ఆనందం కోసం పోస్టర్ రిలీజ్ చేశారా అని అనుకుంటున్నారు. అందుకేనేమో ఆ పోస్టర్‌ను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు అని అర్థమవుతోంది. రూ. 500 కోట్లు అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి గొప్ప విషయాన్ని లైట్ తీసుకోవడం ఏంటి అనేదే ప్రశ్న. మామూలుగా అయితే ఈ సినిమాకు రూ. 100 కోట్లు వచ్చేస్తా అంటూ ఆ మధ్య తెగ హడావుడి జరిగింది.
దానికి కారణంగా తొలి వారాంతంలో సినిమాకు రూ. 300 కోట్లు వచ్చాయి. దీంతో రూ.వెయ్యి కోట్లు పెద్ద విషయం కాదు అనుకున్నారు. కానీ వీకెండ్ అయిపోయి కొత్త వీక్ మొదలవ్వగానే మొత్తం లెక్క మారింది. ఆ సమయంలో వసూళ్ల లెక్కలు నిర్మాతలు చెప్పినా.. అవి కరెక్ట్ కావు అని ఆయనే చెప్పేయడంతో మొత్తం సిట్యువేషన్ టర్న్ అయిపోయింది.