Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » హౌరా బ్రిడ్జ్

హౌరా బ్రిడ్జ్

  • February 3, 2018 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హౌరా బ్రిడ్జ్

2014లో విడుదలైన “బూచమ్మ బూచోడు” అనే చిత్రంతో దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకొన్న రేవన్ యాదూ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “హౌరా బ్రిడ్జ్”. రాహుల్ రవీంద్రన్-చాందిని చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది విడుదలవ్వాల్సి ఉండగా కారణాంతరాల వలన పలుమార్లు పోస్ట్ పోన్ అయ్యి నేడు (ఫిబ్రవరి 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొదటి చిత్రంతో ఆకట్టుకొన్న రేవన్ యాదూ రెండో చిత్రంతో ఏమేరకు అలరించాడో చూద్దాం..!!howrah-bridge-movie-review-5

కథ : ఇంట్లో పెద్దలు పెళ్లి చేసుకోమని చెప్పడంతో తెలియనివారిని పెళ్లాడడం కంటే తనకు చిన్నప్పట్నుంచి తెలిసిన స్వీటీ ని ప్రేమించి పెళ్లాడాలని నిశ్చయించుకొని కలకత్తా నుండి మాచవరం వస్తాడు అజయ్ (రాహుల్ రవీంద్రన్). అక్కడి లోకల్ పెద్ద మనిషి (అజయ్) మరదలైన స్వీటీ (చాందిని చౌదరి)ని తాను చిన్నప్పుడు ఇష్టపడ్డ స్వీటీ అనుకొని ఆమెను ప్రపోజ్ చేస్తాడు. కానీ.. అప్పటికే తనను చిన్నప్పట్నుంచి పెంచి తన ఉనికికి కారకుడైన బావను మోసం చేయలేక, తన మనసులో ఉన్న అజయ్ ను పెళ్లాడలేక కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్న స్వీటికి ఉన్నట్లుండి షాక్ ఇస్తాడు అజయ్. దాంతో ఆత్మహత్యకు పూనుకుంటుంది స్వీటీ. అసలు స్వీటీ ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించింది? అజయ్ తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన స్వీటీకి ఇచ్చిన షాక్ ఏంటి? అనేది తెలియాలంటే “హౌరా బ్రిడ్జ్” చూడాలన్నమాట.howrah-bridge-movie-review-3

నటీనటుల పనితీరు : రాహుల్ రవీంద్రన్ సినిమాల్లో హీరోగా నటించడాన్ని పక్కనపెట్టి దర్శకత్వంవైపు ఎందుకు దృష్టి సారించాడు అనే విషయం ఈ సినిమా చూశాక అర్ధమవుతుంది. ఇకపోతే.. నటుడిగా క్యూట్ గా కనిపించినా ఎమోషన్స్ విషయంలో మాత్రం బాబు వర్కవుట్ చేయాల్సింది చాలా ఉంది. చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నప్పుడే కాస్త ఒద్దికగా, అందంగా కనిపించేది, కాస్తో కూస్తో నటించేది. కానీ సినిమాల్లోకి వచ్చాక క్యారీ వ్యాన్ మీద కాన్సన్ ట్రేషన్ ఎక్కువై తెరపై హావభావాలు పలికించడం మీద ధ్యాస మరల్చలేక సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో ప్రేక్షకుల్ని ఇబ్బందిపెడుతుంది. ఇక పాపం అజయ్ నటుడిగా తన పాత్రను పోషించిన విధానం బాగున్నా.. క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకపోవడంతో మనోడి పాత్రను నెగిటివ్ గా తీసుకోవాలా లేక అతడ్ని చూసి జాలిపడాలో అర్ధం కాదు సగటు ప్రేక్షకుడికి. రావురమేష్ ని ఓ వారం రోజులు డేట్స్ అడిగి కంగారు కంగారుగా షూట్ చేసినట్లుగా ఉంటాయి ఆయన సన్నివేశాలు.

అసలు ఆయన సీన్స్ వల్ల కథనం ముందుకు జరగడం అనేది పక్కనపెడితే.. అసలెందుకు వస్తున్నాయో క్లారిటీ ఉండదు. మనాలి రాథోడ్ ఈ సినిమాలో యాడ్ ఫిలిమ్ మేకర్ గా నటించిన తీసిన “మూడ్స్ కండోమ్” యాడ్ ఏదైతే ఉందో.. దర్శకుడి ప్రతిభకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమాలో బోలెడన్ని పాత్రలున్నాయి. కానీ ఆ పాత్రల గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు. howrah-bridge-movie-review-4

సాంకేతికవర్గం పనితీరు : శేఖర్ చంద్ర బాణీలు బాగున్నాయి. అయితే.. అవి చూడ్డానికి మాత్రం బాగోవు. అలాగే నేపధ్య సంగీతం విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండు. విజయ్ మిశ్రా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. హీరోహీరోయిన్ల నడుమ వచ్చే శృంగార/రొమాన్స్ సీన్స్ కి పెట్టిన ఫ్రేమింగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాకపోతే ఆ ఫ్రేమ్స్ పోస్టర్స్ వరకే పరిమితమవ్వడం బాధాకరం. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి కానీ.. ఆ ఖర్చు మొత్తం ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది తప్ప ప్రేక్షకుడి కంటికింపు కలిగించకపోవడం మైనస్.

దర్శకుడు రేవన్ యాదూ రాసుకొన్న కథకు తలా తోక లేకపోవడం మొదలుకొని స్క్రీన్ ప్లేలో అసలు ఆత్మ లేకపోవడం, ప్రధాన పాత్రధారుల క్యారెక్టరైజేషన్స్ లో క్లారిటీ లేకపోవడం వంటివి చూశాక ఆయన నిర్మాతల చేత ఖర్చుపెట్టించడానికి చూపిన ఆసక్తిలో సగం కూడా కథ-కథనంపై పెట్టలేదని అర్ధమవుతుంది. అసలు ఒక సన్నివేశం తర్వాత మరో సన్నివేశం ఎందుకు వస్తుంది అనే విషయంలో దర్శకుడికి ఎంత క్లారిటీ ఉందో తెలియదు కానీ.. అవి చూస్తున్న ప్రేక్షకుడికి మాత్రం ఉన్న క్లారిటీ పోయి బుర్ర వేడెక్కడం ఖాయం. అసలు సినిమా మొత్తం అయిపోయాక ఎండ్ క్రెడిట్స్ కి ముందు కలకత్తాలోని “హౌరా బ్రిడ్జ్”ను చూపించి టైటిల్ జస్టిఫై చేయడం అనేది వయబ్బో అనుకోకమానరు ఎవరైనా. సాధారణంగా మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ సెకండ్ సినిమాతో హిట్ కొట్టలేకపోవడాన్ని “సెకండ్ సినిమా సిండ్రోమ్” అనుకోంటుంటాం. కానీ.. యావరేజ్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలెట్టిన రేవన్ యాదూ రెండో చిత్రం కోసం కనీసస్థాయి జాగ్రత్త తీసుకోకుండా సినిమా తీయడం ఎందుకో అర్ధం కాదు. howrah-bridge-movie-review-2

విశ్లేషణ : సినిమా తీయడం కోసం అద్భుతమైన కథలు రెడీ చేసుకొని కృష్ణానగర్ లో షూలు అరిగిపోయేలా తిరుగుతున్న నవతరం దర్శకులు కోకొల్లలు ఉన్నప్పటికీ అదృష్టం కలిసివచ్చి దర్శకులుగా తొలి చిత్రంతో పేరు తెచ్చుకోవడం వరకూ బాగానే ఉంటుంది. కానీ.. సెకండ్ సినిమాకే తాము మొదటి సినిమా కోసం శ్రమంతా మర్చిపోయి కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకోకుండా తెరకెక్కిస్తే “హౌరా బ్రిడ్జ్” లాంటి సినిమాలు వస్తాయి.howrah-bridge-movie-review-1

రేటింగ్ : 1/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandini Chowdary
  • #Howrah Bridge Movie Review
  • #Howrah Bridge Review
  • #Howrah Bridge Telugu Movie Review
  • #Rahul Ravindran

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్.. గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్.. గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

related news

Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

Sanjeev Reddy: టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్టే..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The Girlfriend Review in Telugu: ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rahul Ravindran, Rashmika: ‘ఆడవాళ్లు తాళి వేసుకోవడం వివక్ష’.. ‘అబ్బాయిలకి కూడా పీరియడ్స్ వస్తే బాగుణ్ణు’.. ఏం చెత్త స్టేట్మెంట్లు ఇవి!

Rahul Ravindran, Rashmika: ‘ఆడవాళ్లు తాళి వేసుకోవడం వివక్ష’.. ‘అబ్బాయిలకి కూడా పీరియడ్స్ వస్తే బాగుణ్ణు’.. ఏం చెత్త స్టేట్మెంట్లు ఇవి!

trending news

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్.. గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్.. గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు

10 mins ago
Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

3 hours ago
భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

18 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

18 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

19 hours ago

latest news

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

51 mins ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

57 mins ago
Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

2 hours ago
Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

Vijay Devarakonda: హాలీవుడ్ విలన్ తో పోరుకు సై అంటున్న రౌడీబాయ్ విజయ్..!

2 hours ago
దిగ్గజ నిర్మాత కన్నుమూత.. శోకసంద్రంలో దక్షిణ సినిమా!

దిగ్గజ నిర్మాత కన్నుమూత.. శోకసంద్రంలో దక్షిణ సినిమా!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version