ఆగస్టు 14న 2 పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రం. మరొకటి బాలీవుడ్ స్టార్ హీరో నటించిన ‘వార్ 2’. ఈ 2 సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే.. ‘వార్ 2’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ఓ హీరోగా నటించాడు. సో ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ ‘వార్ 2’ కి యాడ్ అవుతుంది. ఇక ‘కూలీ’ లో టాలీవుడ్ హీరో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూడా అతిథి పాత్ర పోషించాడు.
అందువల్ల తెలుగులోనే కాకుండా నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోపక్క దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్టార్ ఇమేజ్ కూడా ‘కూలీ’ కి ప్లస్ పాయింట్. కానీ ‘వార్ 2’ కి దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇమేజ్ ఏమీ యాడ్ అవ్వదు. మొత్తం హీరోల ఇమేజ్ పైనే హైప్ ఏర్పడింది. సో ఏదేమైనా ‘కూలీ’ ‘వార్ 2’ సినిమాలు కనుక హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధిస్తే సౌత్, నార్త్ సినీ పరిశ్రమలకు కూడా చాలా మంచిదే. ఎందుకంటే సరైన సినిమాలు లేక చాలా కాలంగా బాక్సాఫీస్ డల్ గా ఉంది.
ఇవి కనుక హిట్ అయితే సినీ పరిశ్రమకు మంచి ఊపు ఇచ్చినట్టు అవుతుంది. ఇదిలా ఉంటే.. ‘కూలీ’ హీరో రజినీకాంత్ నటించిన ఓ సినిమాలో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు అనే విషయాన్ని నెటిజెన్లు గుర్తుచేసుకుంటున్నారు. 1986 లో రజినీకాంత్ నటించిన హిందీ సినిమా ‘భగవాన్ దాదా’ లో హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 39 ఏళ్ళ తర్వాత ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం గమనార్హం.
How many of you know..?
Hrithik acted as child artist in Super star thaliva’s movie #Bhagwandada (1986) #CoolieThePowerHouse #War2OnAug14 #NTRvsHrithik @iHrithik @tarak9999 pic.twitter.com/V4Vq1pCbKT
— Phani Kumar (@phanikumar2809) August 12, 2025