War 2: షూట్‌ అయిపోయిందన్నారు.. మళ్లీ ఇప్పుడు యాక్షన్‌ అంటున్నారు!

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)  – ఎన్టీఆర్‌  (Jr NTR) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘వార్‌ 2’ (War 2). సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సినిమా గురించి రకరకాల పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా ప్రారంభం నుండి షూటింగ్‌ల అప్‌డేట్‌ల వరకు, షూటింగ్‌ అయిపోయింది అనే మాట నుండి లేదు లేదు ఇంకా ఉంది అనే మాట వరకు అన్నీ పుకార్లుగానే వస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్‌ పుకారు బయటకు వచ్చింది.

War 2

హృతిక్‌ – ఎన్టీఆర్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అయితే షూటింగ్ అయిపోయింది అన్నారు కదా మళ్లీ ఈ షూట్‌ ఏంటి అనే డౌట్‌ చాలామందికి ఉంటుంది. అయితే ఆ పుకార్లే నిజమయ్యాయి. సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందని, ఆ పాట చిత్రీకరణ కూడా మొదలైంది అని చెబుతున్నారు. బాస్కో మార్టిస్‌ దీనికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిసింది.

ముంబయిలోని యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో ఈ పాట కోసం భారీ సెట్‌ సిద్ధం చేశారట. ఈ పాటలో హీరోలతో పాటు దాదాపు 500 మందికిపైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారని సమాచారం. ఆరు రోజుల పాటు చిత్రీకరణ ఉంటుందట. ఎన్టీఆర్, హృతిక్‌.. ఇద్దరూ మంచి డ్యాన్సర్లే అనే విషయం తెలిసిందే. అలాంటి ఇద్దరూ కలసి ఓ పాట కోసం చిందేస్తే అదొక వావ్ ఫ్యాక్టర్ల సమాహారమే అని చెప్పాలి. అలాంటి ఫీట్‌నే ‘వార్‌ 2’ సినిమాతో తీసుకొస్తున్నారు దర్శకుడు అయాన్‌ ముఖర్జీ.

ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తుండగా.. ఇందులో కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే బాలీవుడ్ సినిమాలు గతంలో మాదిరి ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు టైమ్‌కి రావడం లేదు. చూద్దాం మరి ఈ సినిమా విషయంలో ఏమవుతుందో?

ఇలా చేసేవేంటి హీరోయినూ.. ఫేమ్‌ ఇందుకు వాడుకుంటావా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus