Hrithik Roshan: క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించింది.. కాంతార సినిమాకు ఫిదా అయినా హృతిక్ రోషన్!

  • December 13, 2022 / 06:28 AM IST

కన్నడ హీరో రిషబ్ శెట్టి ఒక్కసారిగా సంచలనంగా మారారు.కాంతార సినిమా విడుదలకు ముందు వరకు ఈయన కేవలం దర్శకుడిగా హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం. అయితే ఈయన కాంతార సినిమా ద్వారా ఎప్పుడైతే ప్రేక్షకుల ముందుకు వచ్చారో ఆ క్షణం నుంచి పాన్ ఇండియా స్థాయిలో రిషబ్ శెట్టి పేరు మారుమోగిపోతుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.

ఈ సినిమా కన్నడ భాషలో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఇతర భాషలలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇలా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక ఎంతోమంది రిషబ్ శెట్టి సినిమా తీసిన విధానంపై ప్రశంసల కురిపించారు.ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంశల వర్షం కురిపించగా తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సైతం కాంతార సినిమా గురించి స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్ లు చేశారు.

 

ఈ సందర్భంగా హృతిక్ రోషన్ కాంతార సినిమా చూశానని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. కాంతార సినిమాని చూసి తాను చాలా నేర్చుకున్నానని, రిషబ్ శెట్టి సినిమాని తీసిన విధానం అసాధారణం అయినది. స్టోరీ డైరెక్షన్ ఇందులో ప్రతి ఒక్కరి పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.

ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించాయని, ఇలాంటి అద్భుతమైన సినిమాని తీసినందుకు చిత్ర బృందానికి అభినందనలు అంటూ ఈ సందర్భంగా హృతిక్ రోషన్ కాంతార సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus