Pic Talk: మైత్రి మూవీ మేకర్స్ తో బాలీవుడ్ హీరో!

ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం క్రిష్ సిరీస్ లో భాగంగా ఓ సినిమా చేస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి మూడు సినిమాల కంటే రెట్టింపు బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాకేష్ రోషన్. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా క్రేజ్ పెరిగిన తరువాత సౌత్ డైరెక్టర్స్ తో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు బాలీవుడ్ హీరోలు.

ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ సినిమా చేస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ సౌత్ ఇండియా కాన్సెప్ట్ తో ఓ కొత్త సినిమా చేశారు. అలానే అన్ని భాషల ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా కథ సెట్ అయితే సౌత్ దర్శకులతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు బాలీవుడ్ స్టార్స్. దానికి తగ్గట్లుగానే మన దర్శకులు ప్లాన్ చేస్తున్నారు.

కొన్నాళ్లుగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ హృతిక్ రోషన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను టాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేస్తారని టాక్. ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తీసుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో దర్శకుడు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని కూడా కనిపిస్తున్నారు.

హృతిక్ రోషన్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన్ను కలవడానికి మైత్రి నిర్మాతలు, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని కలిసి వెళ్లినట్లుగా ఉన్నారు. ఈ ఇద్దరు దర్శకుల్లో హృతిక్ రోషన్ ఎవరితో సినిమా చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని మైత్రి సంస్థ నిర్మిస్తుందని తెలుస్తోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus