ఒక్క క్లైమాక్స్ కే అంత పెట్టారు.. సినిమాకి ఎంతయ్యుంటుందో..!

2020 వ సంవత్సరంలో కరోనా వల్ల చూడడానికి పెద్ద సినిమాలు లేకుండా పోయాయి. చాలా పాన్ ఇండియా సినిమాలు అనుకున్న టైంకి కంప్లీట్ కాలేదు. అందులో ‘కె.జి.ఎఫ్ ఛాప్టర్ 2’ కూడా ఒకటి. 2018 డిసెంబర్ 21న విడుదలైన ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ఇండియన్ వైడ్ సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అవి రేంజ్లో ఉన్నాయో… ఇటీవల విడుదలైన ‘కె.జి.ఎఫ్2’ టీజర్ రుచి చూపించింది.

ఈ టీజర్ యూట్యూబ్లో ఏకంగా 170 మిలియన్ వ్యూస్ ను నమోదు చెయ్యడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో హీరో యశ్ ను పార్ట్ 1 కు మించి పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడని స్పష్టం చేసింది ఆ టీజర్. రావు రమేష్, ఈశ్వరి రావు, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్లు ఈ సీక్వెల్లో నటిస్తున్నట్టు కూడా ‘కె.జి.ఎఫ్2’ టీజర్ స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్2’ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ అత్యంత కీలకంగా ఉంటుందట.

సంజయ్ దత్ చేసిన అధీరా పాత్రకు మరియు రాకీ భాయ్ పాత్ర చేస్తున్న హీరో యశ్ ‌కు మధ్య భీకర పోరాట సన్నివేశం ఉంటుందట. కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే నిర్మాతలైన ‘హోంబలె’ వారు ఏకంగా రూ.12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.ఈ ఎపిసోడ్ కచ్చితంగా ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఇన్సైడ్ టాక్.ఇక ఈ సీక్వెల్ మొత్తానికి రూ.130 కోట్ల వరకూ ఖర్చు అయ్యినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus