రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి, బాహుబలి2 సినిమాలతో ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాల వల్లే ప్రభాస్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కడి స్టార్ హీరోలకు సమానంగా గుర్తింపు రావడంతో పాటు ప్రభాస్ సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతోంది. ప్రభాస్ నటించిన సాహో సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ప్రభాస్ కు ఉన్న గుర్తింపు, పాన్ ఇండియా ఇమేజ్ వల్లే డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ మొత్తంలో నష్టాలు వచ్చాయి.
గతేడాది ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలలో రాధేశ్యామ్ సినిమా మొదట రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బడ్జెట్ లో దాదాపు 40 శాతం బడ్జెట్ సెట్స్ కోసమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా 26 సెట్లు వేసినట్లు సమాచారం. ఈ సెట్టింగ్స్ కోసం నిర్మాతలు ఏకంగా 106 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మొదట్లో 100 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తో సినిమాను నిర్మించాలని నిర్మాతలు భావించినా సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు దాటిందని సమాచారం. మరోవైపు సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైనా మేకర్స్ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టలేదు. జులై 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు మొదట్లో ప్రకటన వెలువడినా ఆ తేదీకి ఈ సినిమా రిలీజవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాలలో 100 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత రాధేశ్యామ్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?