Ravi Teja: రవితేజను నమ్మి అన్ని కోట్లు ఖర్చు చేశారా?

  • August 23, 2021 / 07:37 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. సక్సెస్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. రాజా ది గ్రేట్ తర్వాత సరైన సక్సెస్ లేని రవితేజ క్రాక్ సినిమాతో ఈ ఏడాది విజయాన్ని సొంతం చేసుకున్నారు. కథ, కథనం కొత్తగా ఉండటం గోపీచంద్ మలినేని డైరెక్షన్ క్రాక్ మూవీ హిట్ కావడానికి కారణమనే సంగతి తెలిసిందే. క్రాక్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

అయితే ప్రస్తుతం రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాకు ఏకంగా నిర్మాతలు 65కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. దర్శకుడు రమేష్ వర్మ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రవితేజ సినీ కెరీర్ లోనే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నామని రమేష్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే హైప్ కోసం బడ్జెట్ ను పెంచి చెబుతున్నారనే కామెంట్లు సైతం వినిపిస్తుండటం గమనార్హం.

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించే పరిస్థితులు లేవు. రమేష్ వర్మ గత సినిమా రాక్షసుడు హిట్ అయినా ఆ సినిమాకు భారీగా కలెక్షన్లు రాలేదు. మరోవైపు ఖిలాడీ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. రవితేజను నమ్మి నిర్మాతలు నిజంగా 65 కోట్లు ఖర్చు చేశారో లేదో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus