Akhanda Movie: ‘అఖండ’ ముందు అనుకున్న క్లైమాక్స్ అది కాదా?

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ‘అఖండ’. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా ఇదే.. అలాగే ఈ 2021 లో ‘వకీల్ సాబ్’ తర్వాత అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రం కూడా ఇదే. అంతేకాదు బాలయ్య కెరీర్లో రూ.100 కోట్లు వసూల్ చేసిన మొదటి చిత్రంగా కూడా రికార్డులు సృష్టించింది ‘అఖండ’. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్స్ లో కూడా ఆ ఫీట్ సాధించడం అంటే మాములు విషయం కాదు.

ఇక ఈ చిత్రంలో బాలయ్య నటన, బోయపాటి డైరెక్షన్, తమన్ అందించిన నేపధ్య సంగీతం, రామ్ లక్ష్మణ్ అందించిన ఫైట్స్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. శ్రీకాంత్ విలనిజం కూడా బాగానే ఉంది కాకపోతే అతని పాత్ర క్లైమాక్స్ కు అరగంట ముందే ముగించడంతో చాలా మంది ప్రేక్షకులు హర్ట్ అయ్యారు.అలాగే ‘అఖండ’ తర్వాత శ్రీకాంత్.. జగపతి బాబులా బిజీ అయిపోతాడు అని అనుకుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుండీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా గజేంద్ర సాహుని అనుకున్నప్పటికీ.. కీ విలన్ గా శ్రీకాంత్ ను అనుకున్నారట. ఇప్పటి సినిమా ప్రకారం అయితే విలన్ శ్రీకాంత్ ను పెద బాలయ్య(అఘోర) చంపుతాడు. అయితే ముందుగా అనుకున్న క్లైమాక్స్ ప్రకారం అయితే శ్రీకాంత్ ను క్లైమాక్స్ లో యజ్ఞం సీన్ వరకు ఉంచాలనుకున్నారట. అఖండ యజ్ఞంలో ఉన్నప్పుడు చిన బాలయ్య రంగంలోకి దిగి శ్రీకాంత్ ను చంపుతాడట.

అటు తర్వాత అతన్ని మెయిన్ విలన్ మనుషులు కట్టడి చేయడం.. తర్వాత యజ్ఞం పూర్తయ్యి పెద బాలయ్య ఎంట్రీ ఇచ్చి గజేంద్ర సాహుని, అతని అనుచరుల్ని చంపుతాడట. కానీ కొన్ని కారణాల వలన క్లైమాక్స్ మార్చినట్టు తెలుస్తుంది. ముందుగా అనుకున్న క్లైమాక్స్ ప్రకారం అయితే శ్రీకాంత్ కు పెద్ద పీట వేసేట్టు అయ్యేది. కానీ అలా జరగలేదు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus