Summer Movies: 2024 సమ్మర్ మామూలుగా ఉండదట.. ఏకంగా ఇన్ని సినిమాలా?

ప్రతి సంవత్సరం పెద్ద సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా కొన్ని సినిమాలు ఆ అంచనాలను సులువుగానే అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిలవుతున్నాయి. 2024 సమ్మర్ కానుకగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఏప్రిల్ నెల 12వ తేదీన ఇండియన్2 సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇండియన్2 మూవీ గ్లింప్స్ కు ఏకంగా 5.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే సలార్2 మూవీ కూడా 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు 2024 సమ్మర్ కానుకగా విడుదలైతే మాత్రం ఈ సినిమాలు సులువుగా 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.

ఈ మూడు సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాలను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాల రిలీజ్ డేట్లు మారే ఛాన్స్ అయితే లేదు. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకుడు కాగా సలార్2 (Salaar) సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.’

ఇండియన్2 సినిమాకు శంకర్ డైరెక్టర్ కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తాయేమో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus