ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కేజీఎఫ్ టీజర్ స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. అంతలా యూత్ ని ,ముఖ్యంగా మాస్ ని ఆకట్టుకుంది ఈ టీజర్. యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేయడంతో ఫుల్ ఖుషీలో ఉంది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాకి డిమాండ్ కూడా భారీగానే పెరిగింది. ఇప్పటికే తెలుగు రైట్స్ ని కొనేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపిస్తే , కెజిఎఫ్ 2 నిర్మాతలు భారీ షాకిస్తున్నారట. 75కోట్లకు బేరం పెట్టినట్లుగా తెలుస్తోంది.
వారాహి బ్యానర్ పైన ఈ సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇంత రేటు ఇచ్చి కొనేందుకు టాలీవుడ్ లో నిర్మాతలు కూడా కాస్త ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు, మరీ ఎక్కువ రేటు చెప్తే బయ్యర్స్ కూడా వెనకంజ వేసే అవకాశం కనిపిస్తోంది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు, ఈ సమస్య ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఉంది. సినిమా చూస్తుంటే సెన్సేషనల్ కలక్షన్స్ వచ్చేలాగానే కనిపించినా, ఏమాత్రం తేడా కొట్టినా థియేటర్స్ కి జనం రారు. అందులోనూ ఓటీటీల్లో కొద్దిరోజులకే సినిమా అమ్మేస్తున్న ఈరోజుల్లో ఇప్పుడు ఇంత ఖర్చుపెట్టి ఈ సినిమా కొనాలా అని ఆలోచిస్తున్నారు.
అయితే, సినిమాకి మాత్రం డిమాండ్ మామూలుగా లేదు. ఎందుకంటే, కెజిఎఫ్ కన్నా సీక్వెల్ తీయడానికి భారీగానే ఖర్చైంది. దీనికి తోడు లాక్ డౌన్ కారణంగా సినిమా నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. అందుకే హోంబళే నిర్మాతలు కెజిఎఫ్ 2కి భారీగా డిమాండ్ చేస్తున్నారని సినీనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు మాత్రమే కాదు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకి భారీ రేటునే చెబుతున్నారట. మరి ఇంత రేటు వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదీ విషయం.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!