కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వలన చాలా వరకూ థియేటర్లు మూత పడటానికి రెడీగా ఉన్నాయి. పెద్ద సినిమాలు ధైర్యం చేసి ముందుకు వచ్చేలా లేవు. చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.. కానీ వాటికోసం ప్రేక్షకులు కరోనాను లెక్క చెయ్యకుండా థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు. సురేష్ బాబు లాంటి బడా నిర్మాత కూడా తన హ్యాండోవర్లో ఉన్న థియేటర్లను మూసెయ్యాలని చూస్తున్నట్టు కొద్దిరోజుల నుండీ టాక్ వినిపిస్తుంది.దీంతో ఓటిటి లు మళ్ళీ పుంజుకుంటున్నాయి.
ఈ ఏడాది విడుదలైన సినిమాలు మొత్తం ఇప్పటికే చాలా వరకూ ఓటిటిల్లో రిలీజ్ అయిపోయాయి. హిందీలో సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రం కూడా ఓటిటి రిలీజ్ కు రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో టాలీవుడ్ లో కూడా కాస్త క్రేజ్ ఉన్న సినిమాలను భారీ రేట్లకు కొనుగోలు చెయ్యడానికి ఓటిటి సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న ‘అఖండ’ చిత్రాన్ని నేరుగా ఓటిటిలో విడుదల చెయ్యమని ఓ ప్రముఖ సంస్థ.. నిర్మాతలను అప్రోచ్ అయ్యిందట. ఇందుకోసం భారీగా రూ.65 కోట్లు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారట.
అయితే నిర్మాతలు మాత్రం ఇందుకు నొ చెప్పినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఆ సంస్థ వారు ‘ఒకసారి ఆలోచించుకుని తమ నిర్ణయాన్ని చెప్పాలని’ సూచించారట. బాలయ్య గత సినిమాలు అయిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ‘రూలర్’ వంటి చిత్రాలు కనీసం రూ.10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. కానీ బోయపాటి సినిమాలకు భారీ డిమాండ్ ఉంది. అందులోనూ అతను బాలయ్యతో సినిమా చేస్తున్నాడు అంటే.. అంచనాలు భారీగా ఏర్పడతాయి. టీజర్ సృష్టించిన రికార్డులను బట్టి.. అది నిజమే అని స్పష్టమవుతుంది. కాబట్టి ‘అఖండ’ ఓటిటి రిలీజ్ సరైనది కాదనే చెప్పాలి..!
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!