Dhanush: ‘జగమేతంత్రం’ రైట్స్ ఎంతకి అమ్మరంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఓటీటీకి ఇచ్చేశారు. డిజిటల్ రిలీజ్ కావడంతో అనేక భాషల్లో ఆడియోను జోడించినట్లు తెలుస్తోంది. ఏకంగా పదిహేడు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 190 దేశాల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇంత భారీగా విడుదల చేస్తున్న ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంత చెల్లించిందో తెలుసా..?

అక్షరాలా రూ.60 కోట్లు. ఓ రీజనల్ లాంగ్వేజ్ సినిమాకి ఈ రేంజ్ లో రేటు కట్టడం విశేషమనే చెప్పాలి. థియేటర్లో గనుక ఈ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కచ్చితంగా రూ.60 నుండి 70 కోట్ల గ్రాస్ వస్తుంది. అది కాకుండా డిజిటల్ అండ్ శాటిలైట్స్ రైట్స్ అదనం. ఆ లెక్కన చూస్తే నెట్ ఫ్లిక్స్ రీజనబుల్ రేటుకే సినిమాను దక్కించుకుంది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ధనుష్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేశారు.

ధనుష్ కి కూడా ఓటీటీ రిలీజ్ ఇష్టం లేదు. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా దర్శకనిర్మాతలు ఓటీటీ రిలీజ్ కు వెళ్లిపోయారు. ‘పిజ్జా’, ‘జిగర్తండా’, ‘పేట’ లాంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus