మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో ‘అతడు’ (Athadu) సినిమాకి ఓ స్పెషల్ ప్లేస్ ఉంది. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన మొదటి సినిమా ఇది. 2005 ఆగస్టు 10న రిలీజ్ అయ్యింది. థియేటర్లలో బాగానే ఆడింది. కానీ ‘పోకిరి’ (Pokiri) రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమా కాదు. ఒక సైలెంట్ హిట్ సినిమా అంతే..! కానీ టీవీల్లో మాత్రం ఇది ఇండస్ట్రీ హిట్ సినిమా అని చెప్పాలి. అప్పటికి ఈ స్థాయి మేకింగ్ వాల్యూస్ తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు.
కామెడీ, యాక్షన్. లవ్, ఫ్యామిలీ వాల్యూస్, మంచి పాటలు.. ఇలా ఒకటేమిటి అన్నీ కరెక్ట్ మోతాదులో వేసి వండిన అద్భుతమైన వంటకం ‘అతడు’ సినిమా..! రీ రిలీజ్..ల ట్రెండ్ మొదలైనప్పుడు ‘అతడు’ రీ రిలీజ్ కావాలని అభిమానులు గట్టిగా డిమాండ్ చేశారు. మొత్తానికి వారి కోరిక తీరబోతోంది. మహేష్ బాబు 50వ పుట్టినరోజు కానుకగా ‘అతడు’ సినిమాని ఆగస్టు 9న రీ- రిలీజ్ చేయబోతున్నారు.
ఈ రీ- రిలీజ్ కోసం డిస్టిబ్యూటర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం.. రూ.3.06 కోట్లు పెట్టి హక్కులు కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారట. రీ-రిలీజ్ సినిమాకి ఈ రేంజ్లో డిమాండ్ అంటే అంటే చిన్న విషయం కాదు. పైగా ‘అతడు’ ని ‘స్టార్ మా’ ఛానల్ ఇప్పటికే 1500 సార్లు టెలికాస్ట్ చేసింది.
యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ లో అందుబాటులో ఉంది. అయినా ఈ సినిమా రీ- రిలీజ్ హక్కుల కోసం బయ్యర్స్ ఎగబడటం అంటే చిన్న విషయం కాదు. అన్ని కోట్లు పెట్టి రీ- రిలీజ్ హక్కులను కొనుగోలు చేస్తుండటం కూడా చిన్న విషయం కాదు. మరి రీ- రిలీజ్ సినిమాల్లో ‘అతడు’ ఎలాంటి రికార్డులు కొడుతుందో చూడాలి.