ఒకపక్క ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమా సూపర్ హిట్టూ, భారీ లాభాలు వచ్చేస్తున్నాయి అంటూ “2.0” సినిమా గురించి పోలోమని గొప్పలు చేప్పేసుకొని, ఆ రికార్డ్ బ్రేక్ చేసింది.. ఈ రికార్డ్ సృష్టించింది అని పోస్టర్స్ రిలీజ్ చేసుకుంటుంటే.. తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం “నష్టాలు బాబోయ్” అని మొత్తుకొంటున్నారు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్, భారతదేశంలోనే భారీ ప్రొజెక్ట్ అని సంకలు గుద్దుకున్నప్పటికీ.. సింగిల్ స్క్రీన్స్ మాత్రం ఫుల్ అవ్వడం లేదంటూ డిస్ట్రిబ్యూటర్స్ గగ్గోల పెడుతున్నారు.
ముఖ్యంగా.. దర్శకుడు శంకర్ మొదలుకొని సినిమా చూసి ప్రేక్షకులందరూ “సినిమాని 3Dలో మాత్రమే చూడండి” అని తెగ ప్రమోట్ చేయడం, చేస్తుండడంతో వీక్షకులందరూ 3D స్క్రీన్స్ లో చూడడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నారు కానీ.. సింగిల్ స్క్రీన్స్ వైపు చూడడం లేదు. దాంతో తెలుగు రాష్ట్రాల “2.0” డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ భారీ స్థాయిలో నష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.