తెలుగు రాష్ట్రాల్లో సైరా కలెక్షన్స్ ఓ మోస్తరుగా ఉన్నా.. బాలీవుడ్ లో మాత్రం సైరా చిత్రాన్ని పట్టించుకొనే ప్రేక్షకుడు లేకుండాపోయాడు. నార్త్ లో మొదటి వారం వరకూ ఉన్న తెలుగోళ్ళు అందరూ సినిమా చూసేశాక.. నార్త్ బెల్ట్ లో “సైరా”కు కనీస స్థాయి కలెక్షన్స్ లేకుండాపోయాయి. కేవలం బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొనే అమితాబ్ ను నటింపజేయగా.. అది కూడా బాలీవుడ్ వెర్షన్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. హిందీ వెర్షన్ సినిమాను 25 కోట్లకు అమ్మగా.. పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఓ 30 కోట్ల రూపాయల దాకా అయ్యింది. ఇప్పటివరకూ కనీసం 10 కోట్లు కూడా రాబట్టలేకపోయింది “సైరా నరసింహారెడ్డి”.
బాలీవుడ్ లో పాజిటివ్ రివ్యూలు, టాక్ వచ్చినా కూడా అదే రోజున విడుదలైన “వార్” సినిమా పూణ్యమా అని “సైరా” సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాలేదు. నిజానికి వార్ సినిమాకి పెద్దగా పాజిటివ్ రివ్యూలు కానీ, ట్వీట్లు కానీ రాలేదు. కానీ.. కేవలం హృతిక్ రోషన్ & టైగర్ స్టార్ డమ్ & క్రేజ్ పుణ్యమా అని సినిమా బాక్సాఫీస్ దగ్గర హల్ చల్ చేస్తోంది. ఆల్రెడీ 200 కోట్లు క్రాస్ చేసిన ఈ చిత్రం 300 కోట్ల టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!