పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.3 ఏళ్ళ తరువాత పవన్ కళ్యాణ్ ను స్క్రీన్ పై చూసే అవకాశం దక్కడంతో అభిమానులు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున తారా జువ్వలు కాలుస్తూ సందడి చేశారు. మొదటి వీకెండ్ పూర్తయ్యేవరకూ మంచి కలెక్షన్లను నమోదు చేసింది ‘వకీల్ సాబ్’ మూవీ. అయితే సోమవారం నుండీ ఈ చిత్రం కలెక్షన్లు చాలా వరకూ తగ్గాయి. ఉగాది సెలవు రోజున బాగానే కలెక్ట్ చేసినప్పటికీ.. ఆ తరువాతి రోజు సగానికి సగం పడిపోయాయి. ఈ రోజు మరింతగా డ్రాప్ అవ్వడం షాకిచ్చే అంశం.
నిజానికి ఈ చిత్రం టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది అనేది బహిరంగ రహస్యమే. దాంతో పాటు కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా సినిమా పై పడినట్టు స్పష్టమవుతుంది.అంతేకాకుండా త్వరలోనే చాలా థియేటర్లను మూసెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మాత సురేష్ బాబు హ్యాండోవర్లో ఉన్న థియేటర్లను కొన్నాళ్ల పాటు మూసెయ్యాలని భావిస్తున్నారు. అలా అయితే పవన్ మూవీకి పెద్ద దెబ్బ పడినట్టే..! ఇక ‘వకీల్ సాబ్’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో రూ.13 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలి.
ఇప్పటి వరకూ ఒక్క ఉత్తరాంధ్ర, వెస్ట్ గోదావరి ఏరియాల్లో తప్ప ‘వకీల్ సాబ్’ ఎక్కడా బ్రేక్ ఈవెన్ ను సాధించలేదు. రెండో వీకెండ్ అంత పెద్ద మొత్తం రాబట్టే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్లో ఈ చిత్రం చేతులెత్తేసింది.అక్కడ చాలా వరకూ నష్టాలు తప్పేలా లేవు. మరి ఇక్కడి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మరో 4 రోజుల్లో తేలిపోనుంది..!
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!