ఒక 20 ఏళ్ళ క్రితం, హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మాయి, తర్వాత వదిన, అత్త పాత్రలు కూడా పోషించి, ఆ తర్వాత అమ్మమ్మ/నానమ్మ క్యారెక్టర్లు కూడా చేసి రిటైర్ అయ్యేవారు. భానుమతి, సావిత్రి, వాణిశ్రీ, అన్నపూర్ణమ్మ, జానకి, జమున ఇలా నాటి తారలందరూ ఈ ఫార్మాట్ ను ఫాలో అయ్యారు. అందుకే వాళ్ళు ఎక్కువకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. ఆ తర్వాత వచ్చిన తరం హీరోయిన్లు మరీ అత్త, అమ్మమ్మ పాత్రలు చేయకపోయినా వదిన వరకు చేశారు.
ఇక ఇప్పుడొస్తున్న హీరోయిన్లు ఒక పది సినిమాలు చేసి, సైలెంట్ గా బిజినెస్ మ్యాన్ లను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. అయితే.. ప్రస్తుతం సీనియర్ హీరోలకు తమ సినిమాలకు హీరోయిన్లను ఫైనల్ చేయడం పెద్ద టెన్షన్ అయిపోయింది. అందరు సీనియర్ హీరోలకు ఉన్న ఏకైక ఆప్షన్ నయనతార. ఆమెను మాత్రం ఎన్ని సినిమాల్లో అని పెట్టుకుంటారు. కుర్ర హీరోయిన్లేమో కూతుళ్లలా ఉంటున్నారు మన హీరోల పక్కన. పక్క భాషల నుంచి కాస్త బొద్దుగా ఉన్న భామలను ఇంపోర్ట్ చేసుకున్నా..
పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. దాంతో తెలుగు తెరపై చాన్నాళ్లపాటు తమ ప్రాతినిధ్యాన్ని నిరంతరాయంగా కొనసాగించిన ఆమని, సంగీత, ఇంద్రజ లాంటి వాళ్ళు రీఎంట్రీలు ఇస్తున్నారు. రియాలటీ షోల పుణ్యమా అని వాళ్ళు నవతరం ప్రేక్షకులకు కూడా పరిచయమవుతున్నారు. సో, సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ సీనియర్ హీరోలకి హెల్ప్ అవుతుంది.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!