ఆకట్టుకుంటున్న ‘ఆహా’ వారి ‘#BFF’ ట్రైలర్..!

‘ఆహా’ ఓటిటి వారు విభిన్న పద్దతిలో వినూత్న కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.త్వరలో మరో కొత్త ఒరిజినల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘#BFF’. ‘బిగ్‌బాస్5’ ఫేమ్ సిరి హనుమంతు, నటి రమ్య పసుపులేటి, ప్రముఖ జర్నలిస్ట్ అంజలి ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.యూత్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన… నిత్య పాత్రని అదే సిరి హనుమంత్ పాత్రని ప్రేక్షకులకి పరిచయం చేస్తూ ఓ ప్రోమోని వదిలిన సంగతి తెలిసిందే.

దానికి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. ఆ పాత్ర తన మనసుకి చాలా నచ్చిన పాత్ర అంటూ సిరి హనుమంత్ కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇద్దరు అమ్మాయిల జీవితాలు, వారి మధ్య కుదిరిన స్నేహం, వారి జీవితాల్లో ఎదురైన ఊహించని సంఘటనలు.., వారి మధ్య ఏర్పడిన వైరాన్ని… ప్రధాన అంశంగా తీసుకుని దానిని ఫన్ ఫిల్ ఎంటర్టైనర్ గా మలిచాడు దర్శకుడు అని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది.

నిషా కొఠారి పాత్రలో సిరి హనుమంత్, తారా యాదవ్ పాత్రలో రమ్య పసుపులేటి కనిపిస్తున్నారు. ‘నెట్’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన భార్గవ్ మాచర్ల ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఎ డైస్ క్రియేషన్స్’ వారితో కలిసి ‘తమడా మీడియా’ వారు నిర్మిస్తున్నారు. మే 20 నుండీ ‘ఆహా’ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!


మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus