జై లవ కుశ తొలి టీజర్ కి అనూహ్య స్పందన
- July 12, 2017 / 06:55 AM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా జై లవకుశ టీజర్ ఆరవ తేదీ సాయంత్రం రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన ఒక గంటలోనే ఒక మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి తారక్ సత్తా చాటింది. తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నఇందులోని నెగటివ్ క్యారక్టర్ అయిన జై కి సంబంధించిన టీజర్ లో ఎన్టీఆర్ నటన అదరహో అనిపిస్తోంది. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉండటంతో టీజర్ సూపర్ అంటూ రాఘవేంద్రరావు, రాజమౌళి, కొరటాల శివ వంటి డైరక్టర్లు ప్రశంసించారు. ఇలా అందరితో అభినందనలు అందుకుంటున్న ఈ టీజర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది.
యూ ట్యూబ్ చానెల్లో ఆరు రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ దక్కించుకొని ఔరా అనిపించుకుంది. 2,35,000 పైగా లైక్స్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఈ దూకుడు చూస్తుంటే.. సినిమాలు రిలీజ్ అయిన తర్వాత రికార్డ్స్ సృష్టించడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్ .. టీజర్ దశలోనే రికార్డ్ సృష్టించడం ఎన్టీఆర్ స్పెషల్ అనాల్సి వస్తోంది. ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 21 న థియేటర్లలోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















