రీమేక్ డైరెక్టర్లు సక్సెస్ సాధించినా అవకాశాలు రావడం లేదా?

కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులకు సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండటంతో పాటు భారీ సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం రీమేక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులు కొత్త ఆఫర్లు లేక ఖాళీగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. రీమేక్ దర్శకులకు కాలం కలిసిరావడం లేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. గతేడాది గాడ్ ఫాదర్ సినిమాతో మోహన్ రాజా సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా హిట్టైనా మరీ భారీ హిట్ అయితే కాలేదు. మోహన్ రాజాకు కొత్త ఆఫర్లు అయితే రావడం లేదు. ఈ డైరెక్టర్ తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ దర్శకుడు మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. మరో డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్థసానికి సైతం లక్ కలిసి రావడం లేదు. కాటమరాయుడు తర్వాత ఈ డైరెక్టర్ ఖాళీగా ఉన్నారు.

కిషోర్ కుమార్ పార్థసానికి ఏ హీరో ఛాన్స్ ఇస్తారో చూడాల్సి ఉంది. రీమేక్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న వివి వినాయక్ కెరీర్ ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. భీమ్లా నాయక్ సినిమాతో సక్సెస్ సాధించిన సాగర్ కె చంద్ర పరిస్థితి కూడా ఆశించిన రేంజ్ లో లేదు. వేణు శ్రీరామ్ కు కూడా కొత్త సినిమా ఆఫర్లు రావడం లేదు. రీమేక్ డైరెక్టర్లకు ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో రీమేక్ సినిమాలను తెరకెక్కిస్తున్న డైరెక్టర్లు సైతం ఫీలవుతున్నారు.

కొంతమంది డైరెక్టర్లు రీమేక్ సినిమాలు అంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. రీమేక్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ డైరెక్టర్లు సైతం భయపడుతున్నారని సమాచారం అందుతోంది. టాలీవుడ్ రీమేక్ డైరెక్టర్లు ఈ ఏడాది అయినా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus