టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సరైన రిలీజ్ డేట్ ను సెట్ చేసుకోవడం సమస్యగా మారింది. మంచి డేట్ ను ఎంచుకున్నా రిలీజ్ సమయానికి కొత్త సమస్యలు ఏర్పడుతుండటంతో రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి వస్తోంది. అయితే 2024 సంవత్సరం ఏప్రిల్ వరకు విడుదలయ్యే సినిమాలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందుల వల్ల సినిమాల రిలీజ్ డేట్లు మారే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఫిబ్రవరి నెల నుంచి విద్యార్థులు పరీక్షలకు ప్రిపరేషన్ తో బిజీగా ఉండటం వల్ల ఫిబ్రవరి నెల పెద్ద సినిమాల రిలీజ్ లకు అనుకూలం కాదు.
ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానుండగా మార్చి చివరి వారం వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఆ సమయంలో పెద్దసినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆసక్తి చూపరు. మరోవైపు ఏపీలో ఎన్నికలు కూడా సినిమాలపై ప్రభావం చూపనున్నాయి. మార్చి మొదటివారంలో డబుల్ ఇస్మార్ట్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షెడ్యూల్ కాగా ఈ సినిమాలలో ఏదో ఒక సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
విశాల్ హీరోగా తెరకెక్కిన రత్నం కూడా మార్చి నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక సీనియర్ స్టార్ హీరో తన సినిమాను వేగంగా పూర్తి చేసి మార్చి నెలలో రిలీజ్ చేయాలని ఫీలయ్యారు. ఎన్నికల సీజన్ లో ప్రేక్షకులు సినిమాలపై దృష్టి పెట్టే అవకాశాలు కూడా తక్కువ. ఎన్నికల ఫీవర్ వల్ల కొన్ని సినిమాలకు కలెక్షన్లు తగ్గిన సందర్భాలు ఉన్నాయి.
ఈ సినిమాలలో (Movies) ఎన్ని సినిమాలు చెప్పిన తేదీకి విడుదలవుతాయో చూడాలి. ఏప్రిల్ నెలలో షెడ్యూల్ అయిన సినిమాల జాబితాలో సైతం స్వల్పంగా మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.