గత వీకెండ్లో వచ్చిన కొత్త సినిమాల్లో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా.. ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే చెప్పాలి. నిత్యం స్పూఫ్ కామెడీ సినిమాలు చేసి మీమర్స్ కి స్టఫ్ అందించే సంపూర్ణేష్ బాబును మొదటిసారి ఓ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా చేయడం జరిగింది. పూజా కొల్లూరు ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవ్వగా ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా ..
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడంతో పాటు స్క్రిప్ట్ రైటర్ గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. సామాన్యుడి ‘ఓటు’ విలువ తెలియజెప్పే ఓ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇది. అలా అని ఇది ఒరిజినల్ కథ కాదు.. తమిళంలో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మండేలా’ కి రీమేక్. అయితే ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఈ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. రిలీజ్ రోజునే చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి.
శని, ఆదివారాల్లో అయితే మళ్ళీ దసరా సినిమాలకే థియేటర్లు ఇచ్చేశారు. మరోపక్క సోషల్ మీడియాలో దర్శకురాలు పూజకి.. నెటిజెన్లకి మధ్య వార్ జరుగుతుంది. గొప్ప సినిమా తీస్తే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు అంటూ పూజ పెట్టిన పోస్టులకి.. ‘ఏదో సొంత కథతో సినిమా తీసినట్టు బిల్డప్ ఏంటి.. ఇది రీమేక్ సినిమానే కదా’ అంటూ నెటిజన్లు కౌంటర్లు వేశారు.
దీంతో ‘ఓ మంచి కథని రీమేక్ చేస్తే తప్పేంటి?’ అంటూ పూజ మండిపడింది. ఈ వివాదం కూడా సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కి మైలేజ్ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలో ‘సంపూకి స్పూఫ్ కామెడీ సినిమాలే బెటర్’ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!